జాతీయ వార్తలు

రిజర్వేషన్లపై చర్చ కుంటిసాకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలకు అనుకూలంగా ఉండే చట్టాలను కుదించేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని మంగళవారం ప్రియాంక ట్వీట్ చేశారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల ‘అసలు లక్ష్యం’ సామాజిక న్యాయం అని పేర్కొన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాలు ఉన్నతంగా కనిపించినా.. ఉద్దేశాలు మాత్రం చాలా ప్రమాదకరం’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజానుకూల చట్టాలను కుదించేందుకు యత్నిస్తుండగా.. ఆర్‌ఎస్‌ఎస్ రిజర్వేషన్లపై చర్చ అవసరం అంటూ చెప్పడం కుంటి సాకులు మాత్రమేన్నారు. ‘రిజర్వేషన్లపై చర్చ కేవలం కుంటిసాకు మాత్రమే.. వారి ప్రధాన లక్ష్యం సామాజిక న్యాయం’అని ప్రియాంక అభివర్ణించారు. ‘దీనిని మీరు అంగీకరిస్తారా?’ అంటూ ప్రజలను ప్రియాంక ప్రశ్నించారు. రిజర్వేషన్లకు మద్దతు తెలపడం లేదా వ్యతిరేకించడం అనేది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని ఆదివారం మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన మర్నాడు కోటా అనేది ‘అనవసరం’ అని ఆయన ఉద్దేశం కాదని చెబుతూ దీనిపై ప్రజల్లో చర్చ జరగాలని చెప్పడమే దాని ఉద్దేశమని ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొనడం గమనార్హం.