జాతీయ వార్తలు

నేడో, రేపో పదవుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 21: కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్నవారికి ఒకటిరెండు రోజుల్లో మంత్రిత్వ శాఖలు కేటాయిస్తామని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప బుధవారం నాడు ఇక్కడ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు వారాల తర్వాత 17 మందితో ఆయన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రులుగా నియమితులైనవారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, సహాయక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. వీరిని మంత్రివర్గంలో చేర్చుకున్న వెంటనే ముఖ్యమంత్రి యడియూరప్ప వారిని సహాయక చర్యలు చేపట్టేందుకు పంపించారు. అయితే, యడియూరప్ప కేబినెట్‌లో పదవులు కోరుకున్న బీజేపీ నేతలు కొందరు తాజా విస్తరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బాహాటంగానే తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ సీట్లను బట్టి గరిష్ట స్థాయిలో ముఖ్యమంత్రి మినహా 33 మందిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా 17 మందికే యడియూరప్ప అవకాశం కల్పించారు కాబట్టి మరో 16 మందికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర వహించిన కొందరు ‘అనర్హత’ ఎమ్మెల్యేలకు కూడా యడియూరప్ప కేబినెట్‌లో పదవులు లభిం చే సంకేతాలు కనిపిస్తున్నాయి.