జాతీయ వార్తలు

పాక్‌కు నదీ జలాల నిలిపివేతపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 21: సింధు జలాల ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలుగకుండా హిమాలయ ప్రాంతం నదులు పాకిస్తాన్‌లోకి ప్రవహించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని పేర్కొన్న ఆయన దీనివల్ల సింధు జలాల ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలుగదని బుధవారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడం, భారత్‌కు భద్రతా మండలిలో మద్దతు లభించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల్లో హిమాలయ ప్రాంత నదులు పాక్‌కు ప్రవహించకుండా నిరోధిస్తామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సట్లెజ్ నదిలోకి వరద జలాలను విడుదల చేస్తున్నామన్న విషయాన్ని భారత్ తమకు ముందుగా తెలియజేయలేదని, దీనివల్ల పాక్ అంతటా వరద పరిస్థితి ఏర్పడిందని ఆ దేశ నాయకత్వం విమర్శలు గుప్పించింది. మిగులు జలాలు పాకిస్తాన్‌లోకి వెళ్లకుండా ఏవిధంగా వాటిని ఉపయోగించకోవాలన్న దానిపైనే తాము దృష్టి పెట్టామని కేంద్ర మంత్రి తెలిపారు. పరీవాహక ప్రాంతానికి వెలుపల కొన్ని రిజర్వాయర్లు, నదులు ఉన్నాయని, వీటిలోకి మిగులు జలాలు మళ్లిస్తే వర్షాభావ పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుందని ఆయన తెలిపారు. ఆనకట్టలను నిర్మించడంలో ప్రధాన ఉద్దేశం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదని, వర్షాభావ పరిస్థితుల్లో నీటి కొరత లేకుండా చూడాలన్న ఆలోచన కూడా దీనివెనుక ఉంటుందని షెకావత్ తెలిపారు. 1960 సెప్టెంబర్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. సింధు నది, దాని ఉప నదుల జలాలను ఏవిధంగా వినియోగించుకోవాలన్న దానిపై ఈ ఒప్పందం మార్గనిర్దేశనం చేసింది. ఈ నదులన్నీ కూడా రెండు దేశాల్లోనూ ప్రవహిస్తుండడం వల్ల జల పంపిణీ వాటాలను కూడా ఈ ఒప్పందంలో స్పష్టం చేశారు. అయితే, రావి, బియాస్, సట్లెజ్ నదులపై నియంత్రణ అధికారాన్ని భారత్‌కే కట్టబెట్టారని, అలాగే సింధు, చీనాబ్, జీలం నదులపై మాత్రం ఆధిపత్యాన్ని పాకిస్తాన్‌కు అప్పగించింది. సహజంగానే పాకిస్తాన్ నదులకు భారత్ నుంచే ఎక్కువ జలాలు వెళ్తాయి. దీని దృష్ట్యా సింధు, చీనాబ్, జీలం నదీ జలాలను వ్యవసాయ అవసరాల కోసం పరిమిత స్థాయిలో కూడా వినియోగించుకోవడానికి ఈ ఒప్పందం భారత్‌కు కట్టబెట్టింది.