జాతీయ వార్తలు

42 లక్షల మంది టీచర్లకు ‘నిష్ట’ పేరుతో శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: విద్యా రంగంలో నూతన ఒరవడులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 42 లక్షల మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ ‘స్కూల్ హెడ్స్, టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్స్’ (నిష్ట) పేరుతో శిక్షణ ఇవ్వనున్నారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు విద్యార్థులు ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంతో వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తే భవితకు బంగారు బాట పడుతుందన్న అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడమే ’నిష్ట’ ప్రధాన ఉద్దేశమని బుధవారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ స్పష్టం చేశారు.
ఈ పథకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వివిధ అంశాలపై విద్యార్థులను చైతన్య పర్చడం, టెస్టింగ్, లెర్నింగ్ స్కిల్స్, స్కూళ్ల రక్షణ, భద్రత తదితర అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. కృత్రిమ మేథస్సు సహా ఆరోగ్య పరిరక్షణ, పాఠశాల విద్య, లైబ్రరీ, ఎకో క్లబ్, యూత్ క్లబ్, కిచెన్ గార్డెన్, స్కూళ్లలోనే నాయకత్వ లక్షణాలు తదితర ఎన్నో అంశాలపై ఉపాద్యాయులను సుశిక్షితులను చేయడమే ‘నిష్ట’ ప్రధాన ధ్యేయమని మంత్రి వివరించారు. ముఖ్యంగా ఉత్సాహభరిత వాతావరణంలో పాఠశాలలు నడవడమే ‘నిష్ట’ ధ్యేయమని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న 33వేల 120 మంది కీ రిసోర్స్‌పర్సన్లు, స్టేట్ రిసోర్స్‌పర్సన్లు ‘నిష్ట’పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఈపీఏ, కేంద్రీయ విద్యాలయ సమితులు, సీబీఎస్‌ఈ, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎంపిక చేసిన వారితో ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతుందని మంత్రి వివరించారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఏ విధంగా సుశిక్షితులను చేయాలో రిసోర్సు పర్సన్‌లు ఉపాధ్యాయులకు శిక్షణలో తెలియజేస్తారు.