జాతీయ వార్తలు

ఆర్మీలో భారీ సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఆర్మీలో సంస్కరణలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఆమోదం తెలిపారు. సైన్యంలో ప్రత్యేకంగా ఓ విజిలెన్స్ సెల్ ఏర్పాటవుతోంది. ప్రధాన కేంద్రంతో సహా పలు విభాగాల్లో తీసుకురావల్సిన మార్పులు చేర్పులపై గత ఏడాది సమగ్రంగా అధ్యయనం చేశారు. చివరికి ఓ రోడ్ మ్యాప్‌ను తయారు చేశారు. 1.3 మిలియన్ల మంది ఉన్న సైన్యంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. యుద్ధ నైపుణ్యంతో సహా పలు రంగాల్లో బలగాలకు మెరుగురు దిద్దాలన్న లక్ష్యంలో వీటిని తీసుకొచ్చారు.‘సైనిక ప్రధాన కార్యాలయం పునర్‌వ్యవస్థీరకణతోపాటు పలు నిర్ణయాలు చేస్తూ తీసుకొచ్చిన సంస్కరణలకు కేంద్ర రక్షణ మంత్రి ఆమోదం తెలిపారు’అని ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. ప్రధాన కేంద్రం నుంచి 206 మంది అధికారులకు స్థానభ్రంశం కలగనుంది. అవసరాన్ని బట్టి అందుబాటలో ఉన్న యూనిట్లకు వారిని పంపుతారు. అలాంటి అధికారుల్లో ముగ్గురు మేజర్ జనరల్స్, ఎనిమిది మంది బ్రిగేడియర్లు, తొమ్మిది మంది కల్నల్‌లు, 186 మంది లెఫ్టినెంట్ కల్నల్‌లు ఉన్నారు. అలాగే ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీ చీఫ్ పర్యవేక్షణలో విజిలెన్స్ సెల్ ఏర్పాటవుతోంది. సెల్‌లో త్రివిధ దళాల నుంచి ముగ్గురు ప్రతినిధులు ఉంటారు. వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. గతంలోనూ విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికీ అంత పకడ్బంధీగా పనిచేసేదికాదు. అన్ని విభాగాల ప్రమేయంతో కొనసాగుతూ వచ్చింది. ఈసారి అలా కాదని, విజిలెన్స్ సెల్ స్వతంత్రంగా పనిచేస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆర్మీ చీఫ్ పర్యవేక్షణ కింద సెల్ పనిచేస్తుంది. అడిషనల్ డైరెక్టర్ జనరల్(విజిలెన్స్) చీఫ్‌గా ఉంటారు. ఆయనే ఆర్మీ చీఫ్‌తో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంటారు. అలాగే త్రివిధ దళాలకు చెందిన కల్నల్ స్థాయి అధికారులకు విజిలెన్స్ సెల్‌లో ఉంటారు. మానవ హక్కులకు సంబంధించిన కార్యకలాపాలు వైస్‌చీఫ్ ఆఫ్ ఆర్మీ స్ట్ఫా చూస్తారు. దీనికి కూడా ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటవుతోంది. ఏడీజీ(మేజర్ జనరల్ ర్యాంక్ అధికారి) సారథ్యంలో పనిచేస్తుంది. ఆయన ఆర్మీ వైస్‌చీఫ్ పర్యవేక్షణలో పనిచేస్తుంటారు.

చిత్రం... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో బుధవారం ఢిల్లీలోని సమావేశమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్