జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్: ముగ్గురు మృతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రడూన్, ఆగస్టు 21: వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించి ఆదుకునేందుకు వెళ్ళిన హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ మృత్యు ఒడిలోకి వెళ్ళారు. ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ దిగ్భ్రాంతి చెందారు. మరణించిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ జలమయమై, జనజీవనం అస్తవ్యస్థమైంది. అనేక వాగులు, వంకలు, చెరువులు తెగి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ఇండ్లు కూలిపోయాయి. వరదలు, ఇండ్లు కూలిపోవడం వంటి ఘటనల్లో 16 మంది మృతి చెందగా, మరో ఆరుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇలాఉండగా 70 గ్రామాల వరకు నీట మునగడంతో ప్రజలకు కనీసం తినడానికి ఆహార పొట్లాలు, మంచి నీరు అందించాలన్న ఉద్దేశ్యంతో అధికారులు హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందిన ఓ హెలికాప్టర్‌ను రప్పించారు.
అందులో అవసరమైన ఆహార పొట్లాలు, మంచి నీటి బాటిళ్ళు తీసుకుని వెళ్ళి బాధితులు గుమిగూడిన ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా అందించి వెనుదిరిగారు. అయితే ఉత్తర కాశీ జిల్లాలోని మోల్డీ ప్రాంతంలో అకస్మాత్తుగా హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ఉన్న పైలట్, కో-పైలట్, స్థానిక నివాసి మృతి చెందాడని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ (శాంతి-్భద్రతలు) అశోక్ కుమార్ తెలిపారు.

చిత్రం... ఉత్తర కాశీలో బాధిత ప్రజలకు సహాయాన్ని అందించేందుకు వెళ్లిన హెలికాప్టర్ కూలిపోయిన దృశ్యమిది