జాతీయ వార్తలు

రక్షణ, ఖనిజ వనరులపై పరస్పర సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: రక్షణ, ఖనిజ వనరుల వంటి ఆరు కీలక అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని భారత్-జాంబియా దేశాలు నిర్ణయించుకున్నాయి.
మొత్తం ఆరు కీలకాంశాలపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ చగ్వా లుంగు మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఇక్కడికి చేరుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ, జాంబియా అధ్యక్షుడు లుంగు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి నేతలిద్దరూ విస్తృతంగా మంతనాలు జరిపారు. ఇంకా వాణిజ్యం, పెట్టుబడుల విషయంలోనూ పరస్పరం సహకరించుకుంటూ ఇరు దేశాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని భావించినట్లు నేతలిద్దరూ ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దూసుకెళుతున్న భారత్ తమకు సహకరించేందుకు ముందుకు రావడం సంతోషకరమని జాంబియా అధ్యక్షుడు లుంగు తెలిపారు. ప్రజా ఆరోగ్యం, విద్యుత్తుత్పత్తి, తమ దేశ రాజధాని లుసాకాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణను భారత్ సహకారంతోనే విజయవంతంగా అమలు చేయగలిగామని ఆయన వివరించారు.
ఆహార ఉత్పత్తులు, వ్యవసాయం, పర్యాటక రంగం, ప్రజాఆరోగ్యం, ఖనిజాలు తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకోవాలని ఈ సందర్భంగా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరు దేశాల ప్రతినిధుల బృందాలు అన్ని అంశాలపైనా కూలంకషంగా చర్చించుకున్న తర్వాత ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకోవడం జరిగింది.
జాంబియాలో ఇనుక్యుబేషన్ (పొదిగే కేంద్రాల) ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్తుతో వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా వంద సోలార్ పంపులను అందిస్తామని, ఇంకా వెయ్యి టన్నుల బియ్యాన్ని, వంద టన్నుల పాలను అందిస్తామని ఆయన తెలిపారు.
ఖనిజ వనరుల విషయంలో జాంబియా ధనిక దేశమని ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగంలోనూ జాంబియా మరింత బలోపేతం అయ్యేందుకు తమ దేశం నుంచి ఆర్మీ, వాయుసేన బృందాలను పంపించి శిక్షణ ఇప్పించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
చిత్రం... భారత ప్రధాని నరేంద్ర మోదీ, జాంబియా అధ్యక్షుడు ఎడ్గర్ షాగ్వా లుంగూల సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు బుధవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం