జాతీయ వార్తలు

మళ్లీ పేటీఎంకే హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అవార్డుల టైటిల్ హక్కులను పేటీఎం మరోసారి దక్కించుకుంది. నెలకు 3.80 కోట్ల రూపాయల బిడ్డింగ్‌తో ఈ హక్కులను వచ్చే ఐదేళ్ల కాలానికి పేటీఎం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2015లో తొలిసారి అవార్డుల టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను నాలుగేళ్ల కాలానికి పేటీఎం సొంతం చేసుకుందని గుర్తుచేసింది. తాజా ఒప్పందం ప్రకారం 2019-23 కాలానికి 326.80 కోట్ల రూపాయలను పేటీఎం చెల్లిస్తుందని వివరించింది. గత ఒప్పందం ప్రకారం అవార్డుల టైటిల్ హక్కుల కోసం పేటీఎం నెలకు 2.4 కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తుండగా, తాజా ఒప్పందం ప్రకారం ఈ మొత్తం నెలకు 3.80 కోట్ల రూపాయలకు పెరిగింది.