జాతీయ వార్తలు

సీన్ రివర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఐఎన్‌ఎక్స్ మీడి యా కుంభకోణం కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని బుధవారం రాత్రే సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించి విచారించారు. రాజకీయ నేతలు కేసుల్లో అరెస్టు కావడం, విచారణ ఎదుర్కోవడం మామాలే. అయితే మాజీ హోమ్ మంత్రి చిదంబరం విషయంలో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. తాను ప్రారంభించిన భవనంలోనే చిదంబరం విచారణను ఎదుర్కోవడం గమనార్హం. ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి సీబీఐ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంను అరెస్టు చేసి ఇప్పుడదే భవనంలో విచారించడం యాధృచ్చికంగా జరిగిపోయింది. 2011 ఏప్రిల్ 30న యుపీఏ హయాంలో సీబీఐ భవనం ప్రారంభించారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి చిదంబరం ఆ భవనాన్ని ప్రారంభించారు. నూతన భవనం ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు కామనె్వల్త్‌గేమ్స్ కుంభకోణం కేసులో కాంగ్రెస్ నేత సురేష్ కల్మాడీని అరెస్టు చేశారు. ఆయననూ అక్కడే విచారించాల్సి ఉంది. అయితే ప్రారంభోత్సవం వేడుకలు ఉన్నందున కొత్త భవనంలో ఉంచలేదు. కాగా ఎనిమిదేళ్ల క్రితం జరిగిన భవన ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, మానవ వనరులు మంత్రి కపిల్ సిబాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. హైడ్రామా మధ్య బుధవారం పొద్దుపోయాక చిదంబరంను అరెస్టు చేసిన అధికారులు సీబీఐ ప్రధాన కేంద్రానికి తీసుకొచ్చారు. భవన ప్రాంగణంలోని అతిధి గృహంలో మాజీ కేంద్ర మంత్రిని ఉంచి అధికారులు ప్రశ్నించారు.
ఉలిక్కిపడ్డ శివగంగ
కాంగ్రెస్ సీనియర్‌నేత పీ చిదంబరం అరెస్టుతో సొంత జిల్లా శివగంగ ఉలిక్కిపడింది. తమ నాయకుడి అరెస్టును ఆయన మద్దతుదారులు చాల మంది నమ్మలేదు. కొందరయితై మనకెందుకులే అన్నటు వ్యవహరించినా అత్యధికులు మాజీ మంత్రి అరెస్టును ఖండించడం కనిపించింది. చిదంబరానిది తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడి గ్రామం. పూర్తి గ్రామీణ ప్రాంతం కావడంతో చీకటి పడితే నిర్మానుష్యంగా ఉంటుంది. జనం అంతా నిద్రలోకి జారుకోగా చిదంబరం అరెస్టు వార్త ఎలాగో తెలిసింది. సడన్‌గా విషయం తెలియడంతో ముందు ఎవరూ నమ్మలేదు. కాంగ్రెస్‌పై కేంద్రంలోని బీజేపీ సర్కార్ పగబట్టిందని అందులో భాగమే చిదంబరం అరెస్టు అంటూ ఆయన మద్దతుదారులు మండిపడ్డారు. కచ్చితంగా రాజకీయ కక్షసాధింపేనని వీ నెల్లీయన్ అనే యువకుడు అన్నాడు. సమాజంలో ఓ గౌరవప్రదమైన వ్యక్తిని గోడలు దూకి వెళ్లి మరీ అరెస్టు చేస్తారా? అంటూ ఆయన మద్దతుదారులు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కాంగ్రెస్ నేత ఈఎంఎస్ అభిమన్యుడు విమర్శించారు.
కొందరయితే చిదంబరం అరెస్టును పట్టించుకోలేదు. ఆయన చెన్నై, ఢిల్లీలోనే ఉంటాడని, ఎన్నికల సమయంలోనే శివగంగలో ప్రత్యక్షమవుతాడని నిర్మాణ సామగ్రి షాపుయజమాని జీ విమల్ అన్నాడు. మరోపక్క చిదంబరంను అక్రమంగా అరెస్టు చేశారని మద్దతుదారులు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

చిత్రం...ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని విచారించిన సీబీఐ హెడ్‌క్వార్టర్స్ * (ఇన్‌సెట్‌లో ) చిదంబరం