జాతీయ వార్తలు

సైనిక సామర్థ్యంపై రాజ్‌నాథ్ సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 23: దేశంలోని సైనికుల సామర్థ్యంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. లక్నో కంటోనె్మంట్‌లోని 11 గోర్ఖా రైఫిల్స్‌తో పాటు సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం రాజ్‌నాథ్ సందర్శించారు. సెంట్రల్ కమాండ్ పరిపాలనా వ్యవహారాలతో పాటు, ఇతర కార్యకలాపాలను మంత్రికి లెఫ్టినెంట్ జనరల్ అభయ్ కృష్ణ, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ రాజ్‌నాథ్ వివరించారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను ఆర్మీ అధికారులు విడుదల చేశారు. సైనిక సామర్థ్యంపై రాజ్‌నాథ్ పూర్తి నమ్మకాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. సైనికులు, వెటరన్‌ల సంక్షేమానికి చేపడుతున్న పాలనాపరమైన అంశాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 11 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్ పర్యటన సందర్భంగా శిక్షణా పరమైన అంశాలతో పాటు అక్కడ కల్పిస్తున్న సదుపాయాలను కూడా మంత్రి అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా సైనిక శిక్షణలో భాగంగా నిర్వహించే పారా స్లైడింగ్, రాక్ క్లైంబింగ్, మార్షల్ ఆర్ట్స్‌లను రాజ్‌నాథ్ తిలకించారు. సైనికులు ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా సైనికులు, అధికారులతో కలిసి మంత్రి రాజ్‌నాథ్ విందుచేశారు.