జాతీయ వార్తలు

మోదీ ప్రభుత్వంలోనే ముస్లింలకు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే తమకు రక్షణ ఉందన్న అభిప్రాయం ముస్లిం మైనారిటీల్లో వ్యక్తమవుతోందని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. ముస్లింలలో దశాబ్దాలుగా బీజేపీ అంటే ఓ ద్వేషభావం కల్పిస్తూ వచ్చారని ఆయన ఆరోపించారు. కొన్ని శక్తులు పనిగట్టుకుని ముస్లిం మైనారిటీల మనసుల్లో విషబీజాలు నాటాయని నఖ్వీ ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మోదీ సమర్ధవంతమైన పాలన చూశాక మైనారిటీల్లో ఎంతో మార్చు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. విష ప్రచారం నుంచి బయట పడుతున్నారని కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి స్పష్టం చేశారు.‘1980లో బీజేపీ ఆవిర్భవం జరిగింది. అంతకు ముందు వరకూ అంటే 1950 నుంచి జనసంఘ్ చరుగ్గా ఉండేది’అని మంత్రి పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం మైనారిట్లో భరోసా కల్పించందని ఆయన అన్నారు. అంతకు ముందు పార్టీలు తమ ఓట్లు వేయించుకోవడమే తప్ప బాగోగులు పట్టించుకోలేదన్న అభిప్రాయం ముస్లిం మైనారిటీల్లో వ్యక్తమవుతోందని నఖ్వీ చెప్పారు. మైనారిటీలను రాజకీయ పార్టీలు దోచుకున్నాయని ఆయన విమర్శించారు. జనాభాను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుటుంబ నియంత్రణ వంటిది కాదని, అదొక ‘ఎమర్జెన్సీ స్టయిల్’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఇలాంటి సున్నితమైన అంశంపై సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన అన్నారు. అలాగే దానిని ఒక మతపరమైందిగా చూడడం సరైంది కాదని నఖ్వీ విజ్ఞప్తి చేశారు. ‘అధిగ జనాభాపై ప్రజల్లో అవగాహన తీసుకురాలి. స్వచ్ఛ కార్యక్రమంలా మంచి ప్రచారం చేయాలి’అని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌లో పెహ్లుఖాన్‌పై జరిగిన మూకదాడి, హత్య కేసులో నిందింతులందర్నీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా‘శాంతి భత్రదలు పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. నేరస్తులను శిక్షించే అధికారం వారికే ఉంటుంది’అని చెప్పుకొచ్చారు. ప్రతిదాన్నీ మతం కోణంలోనే చూడడం సరైంది కాదన్న మంత్రి నేరం ఏదైనా కఠినంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు తరువాత ముస్లిం మైనారీటల్లో మోదీ ప్రతిష్ట పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జీఎస్‌టీ సహా పలు సంస్కరణలు మోదీ ప్రభుత్వం ప్రతిష్టను పెంచాయని నఖ్వీ చెప్పారు. ఎలాంటి వివక్షలేకపోవడం, దాడులు జరగకపోవడంతో మైనారిటీల్లో మోదీ ప్రభుత్వం నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు. ‘70 ఏళ్లుగా మైనారిటీల్లో బీజేపీ పట్ల ఓ రకమైన ద్వేషభావం కలిగించారు. వారి మనసులు పాడు చేశారు. అలాంటి భయాలు, అభిప్రాయాలు ఇప్పుడు లేవు, మోదీ ప్రభుత్వంలో మాకు భద్రత ఉందన్న ధీమా ముస్లిం మైనారిటీల్లో ఉంది’అని ఆయన వివరించారు.
ఉమ్మడి పౌరసత్వంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీపై నఖ్వీని అడగ్గా‘ఇప్పటి వరకైతే దానిపై ఎక్కడా, ఏ స్థాయిలోనూ చర్చ జరగలేదు’అని బదులిచ్చారు.