జాతీయ వార్తలు

మరిన్ని చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 24: దేశాన్ని ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భారత్‌పై పడే ప్రమాదం ఉన్నందున కేంద్రం పూర్తి అప్రమత్తంతో వ్యవహరించాలని శనివారం ఆమె ట్వీట్ చేశారు. ఇప్పటికైతే కేంద్రం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని, అయితే ఇవి సరిపోవని మాయావతి స్పష్టం చేశారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వత్తిడికి గురవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మాంద్యంను అధిగమించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు బాగానే ఉన్నప్పటికీ మరిన్ని చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ‘కేంద్రం మరింత శ్రమించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
దానికి తోడు నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఉద్రిక్తలు, హింసతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వారిని తక్షణం ఆదుకోడానికి రంగంలో దిగాలని బీఎస్పీ అధినేత్రి మరో ట్వీట్‌లో కోరారు. ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు కేంద్రం కొన్ని విధానాలు ప్రకటించిన మర్నాడే మాయావతి ఈ ట్వీట్లు చేయడం గమనార్హం. ఈనెల 17న మాయావతి ఓ ట్వీట్ చేస్తూ దేశంలో ఆర్థిక మాంద్యం పొంచిఉందని హెచ్చరించారు.‘వాణిజ్య వర్గాల్లో భయాందోళనలు తగ్గించే చర్యలు చేపట్టాలి. ఉద్యోగాలు కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మాంద్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’ అని ఆమె కోరారు.