జాతీయ వార్తలు

ప్రశాంతంగా కాశ్మీర్ లోయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 24: జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాశ్మీర్ లోయలో చాలా ప్రాంతాల్లో శనివారం ఆంక్షలు సడలించారు. ముందు రోజు శుక్రవారం ప్రార్థనలున్నప్పటికీ బలగాలు మోహరించడంపై జనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో బందోబస్తు తప్పలేదు. అయితే శనివారం లోయలోన అనేక ప్రాంతాల్లో ఆంక్షలు సడలించారు. బహిరంగ ప్రదేశాల్లో బలగాలు ఉన్నప్పటికీ జనాన్ని ఎక్కడా అడ్డుకోవడం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగారని వారన్నారు. ఎక్కువ చోట్ల బారికేట్లు తీసివేశారు. కాశ్మీర్ లోయ అలాగే శ్రీనగర్ పట్టణంలో ఇనుప తీగలతో ఏర్పాటు చేసిన కంచెలు కొనసాగించారు. ప్రజలను భద్రతాసిబ్బంది ఎక్కడా అడ్డుకున్న సందర్భాలు లేవని, గుర్తింపుకార్డులు మాత్రం అడిగేవారని అధికార వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ప్రార్ధనలు సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అంతా ప్రశాంతంగా ఉందని వారన్నారు. యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూపుకార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. భారత్, పాకిస్తాన్‌లోనూ సంబంధిత ఆఫీసు వద్ద నిరసన చేపడతామని హెచ్చరించిన నేపథ్యంలో శుక్రవారం బలగాలను అప్రమత్తం చేశారు. శనివారం నాడు రవాణా వ్యవస్థ మెరుగుపడింది. వీధుల్లో వాహనాలు సంచారం బాగా పెరిగింది. అయితే లోయ ప్రాంతంలో తప్ప కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో 20వ రోజూ వాణిజ్య సముదాయాలు, షాపులు, మార్కెట్లు మూతబడే ఉన్నాయి. వాహనాలు రోడ్లపైకి రాలేదు. ప్రభుత్వ రవాణా కూడా స్తంభించిపోయింది. శ్రీనగర్ పట్టణంలోని లాల్ చౌక్, బటామలూ ప్రాంతంలో రోడ్లపక్కన బళ్ల స్టాల్స్ కనిపించాయి. వెండర్లు వ్యాపారాలు చేసుకోవడం కనిపించింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసే ఉంచారు. ఈనెల 5న ఆర్టికల్ 370 రద్దు తరువాత నుంచి మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యాలు నిలిపివేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం లైండ్‌లైన్స్ సదుపాయం పునరుద్ధరించినట్టు అధికారులు వెల్లడించారు. కమర్షియల్ హబ్ లాల్‌చౌక్, ప్రెస్ ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై ఆంక్షలు కొనసాగుతునే ఉన్నాయి.