జాతీయ వార్తలు

నాలుగు వారాల్లో తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23:ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ మీద నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి)ద్వారా ఆయన సవాలు చేశారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాలలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు దీని కారణంగానే ఎస్‌పిఎల్‌ను తిరస్కరిస్తున్నామని తెలిపింది. అయితే ఈ అంశంపై హైకోర్టు నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నామని స్తున్నమని సుప్రీకోర్టు తెలిపింది. అలాగే హైకోర్టు నిర్ణయం తీసుకోక పోతే తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు అనుమతినిచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలపివేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ ద్యారా హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. అయితే హైకోర్టు అదేశాలను సవాల్ చేస్తు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ ఎస్.ఎ బాబ్డే,జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు ఈ కేసులో ఇప్పటికే ఏసీబి అధికారులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషట్ దాఖలు చేశారు.ప్రత్యేక కోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటప్పడు ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. ఎఫ్‌ఐఆర్ నమోదై చార్జిషిట్ దాఖలై తర్వాత రెండొ ఎఫ్‌ఐఆర్ చట్ట విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 19 ప్రకారం దర్యాప్తుపై స్టే ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే హైకోర్టు ఎనిమిది వారాలు స్టే ఇచ్చినందున అక్కడే ఈ పిటిషన్‌ను నిర్ణయించేలా ఆదేశాలివ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోర్టును కోరారు.పిటిషనర్ ఆర్కే తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.