జాతీయ వార్తలు

తమిళనాట హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు/కొచ్చి, ఆగస్టు 24: తమిళనాడులోకి ఆరుగురు లష్కరే ఉగ్రవాదులు ప్రవేశించాలన్న ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భారత నావికాదళం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని తీరప్రాంతం సహా అనేక చోట్ల రెండో రోజు శనివారం నిఘా కొనసాగింది. గస్తీని ముమ్మరం చేశారు. ‘ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో నావికాదళంలో హై అలెర్ట్ ప్రకటించాం. సముద్రం అలాగే తీర ప్రాంతాల్లో పూర్తి అప్రమత్తత కొనసాగుతోంది’ అని రక్షణశాఖ అధికారి ప్రతినిధి ఒకరు కేరళలోని కోచీలో వెల్లడించారు. శ్రీలంక నుంచి లష్కరే ఉగ్రవాదులు భారత్‌లో పర్యటించారని ఇంటిలిజెన్స్ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. దీంతో తమిళనాడు అంతటా గస్తీ ముమ్మరం చేశారు. కొయంబత్తూరు నగర పరిసరాల్లో హైఅలెర్ట్ ప్రకటించినట్టు పోలీసు కమిషనర్ సుమిత్ శరణ్ స్పష్టం చేశారు. నగరంలోని హైవేలు, ఇన్నర్ రోడ్లపై వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. సాయుధ బలగాలు మోహరింపుజరిగింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయం వద్ద తనిఖీలు కొనసాగాయి. తమిళనాడు కమాండోఫోర్స్ మెట్టుపాలెం వద్ద ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. ఆలయాలు, మసీదులు, చర్చిల గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. బలగాలను దించారు. కేరళ రాష్టమ్రంతటా పూర్తి అప్రమత్తత పాటిస్తున్నట్టు డీజీపీ లోక్‌నాథ్ బెహేరా ప్రకటించారు.