జాతీయ వార్తలు

అన్నింటా ఆద్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని, జాతికి పూడ్చలేని నష్టమని రాష్టప్రతి కోవింద్ మొదలుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సహా యావత్ భారతం స్పష్టం చేసింది. జాతి నిర్మాణంలో వివిధ హోదాల్లో జైట్లీ చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ గుర్తు చేసుకున్నారు. అరుణ్ జైట్లీ తనకు అత్యంత విలువైన స్నేహితుడని, ఆయనతో సరితూగేవారు అతి కొద్దిమందే ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయనతో తనకు కొన్ని దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉందని, దానిని గౌరవంగా తాను భావిస్తున్నానని మోదీ తెలిపారు. విషయాల మీద ఆయనకు ఉన్న అవగాహన, సమస్యలను అర్థం చేసుకోవడం ఉన్న నైపుణ్యం అత్యంత విస్తృతమైందని మోదీ తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ కెరీర్‌లో జైట్లీ ఎన్నో పదవులు నిర్వహించారని, ప్రతి పదవికి వనె్న తెచ్చారని మోదీ అన్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వృద్ధికి రక్షణ సామర్థ్యాన్ని ఇనుమడింపజేయడానికి ఆయనకు ఎంతో వీలు కలిగిందని, అలాగే ప్రజలకు మేలు చేసే ఆర్థిక నిర్ణయాలను అమలు చేశారని, చట్టాలనూ తీసుకువచ్చారని మోదీ తెలిపారు. అరుణ్ జైట్లీతో తనకు అత్యంత సన్నిహితమైన సంబంధం ఉందని, ఆయన అత్యంత ప్రతిభాశీలత కలిగిన న్యాయవాది అని రాష్టప్రతి కోవింద్ అన్నారు. అలాగే, విలువలు కలిగిన పార్లమెంటేరియన్‌గా విశిష్ట ప్రతిభ కనబరిచిన మంత్రిగా కూడా జైట్లీ రాణించారని కోవింద్ తెలిపారు. ఆయన మరణం రాజకీయాల్లో తీరని లోటని, అలాగే ఆయన మేధస్సు తిరుగులేనిదని రాష్టప్రతి పేర్కొన్నారు. జైట్లీ మరణించారన్న విషయం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. దీర్ఘకాలంగా జైట్లీతో తనకు అత్యంత సన్నిహితమైన మైత్రి ఉందని, ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా నష్టమని ఆయన అన్నారు. ఆర్థికమంత్రిగా, రక్షణ మంత్రిగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా జైట్లీ నిరుపమాన సేవలు అందించారని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సామాన్య ప్రజలకు ఆయన చేసిన సేవలు నిరంతరం గుర్తుండిపోతాయని ఆయన అన్నారు. దీర్ఘకాలం పాటు జైట్లీకి మార్గదర్శకుడిగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ కూడా జైట్లీ మరణం బీజేపీకే కాకుండా సంఘ్ పరివార్‌కు తీరని నష్టమని ఆయన అన్నారు. జైట్లీ సమర్థుడైన న్యాయవాది అని, వాక్పటిమ కలిగిన నాయకుడని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నారు. లోతైన మేధస్సు, విజ్ఞానం మేళవించిన వ్యక్తిగా మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరణం పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు నిరంతరం గుర్తుండిపోతాయని సోనియా అన్నారు. దీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఆయన ఎన్నో పదవులు నిర్వహించి ప్రజా సేవకే అంకితమయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు. జైట్లీ మరణించారన్న వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
*
ప్రధాని నరేంద్ర మోదీతో ..వాజపేయితో.. *మమతా బెనర్జీతో.. *చిదంబరంతో... *దర్మేంద్రతో..అరుణ్ జైట్లీ (ఫైల్‌ఫొటోలు)