జాతీయ వార్తలు

జైట్లీకి కడసారి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం ఇక్కడి యమునా నది ఒడ్డున గల నగమ్‌బోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో జరిగాయి. జైట్లీ అంత్యక్రియలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జైట్లీ కుమారుడు రోహన్ తన తండ్రి కర్మకాండలు నిర్వహించారు. 66 ఏళ్ల బీజేపీ దిగ్గజ నేత అరుణ్ జైట్లీ ఆదివారం అనారోగ్యంతో ఇక్కడి నిమ్స్ ఆసుపత్రిలో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు, బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ, పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, పార్టీ ఎంపీలు విజయ్ గోయల్, వినయ్ సహస్రబుద్ధే, కాంగ్రెస్ నాయకులు కపిల్ సిబాల్, జ్యోతిరాదిత్య సింధియా జైట్లీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, విజయ్ రూపానీ, బీఎస్ యడియూరప్ప, నితీష్ కుమార్, త్రివేంద్ర సింగ్ రావత్ కూడా జైట్లీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు జైట్లీ భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి శ్మశానికి తరలించే ముందు ‘జైట్లీ అమర్ రహే’
అంటూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చివరిసారిగా జైట్లీ మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంత్యక్రియలు జరిగిన యమునా నది ఒడ్డున గల నిగమ్‌బోధ్ ఘాట్ సమీపంలోని రహదారులపై జైట్లీని గుర్తు చేసుకుంటూ పెద్దఎత్తున పోస్టర్లు వెలిశాయి.
బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉంచిన దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతదేహం అంత్యక్రియలకు తరలించే ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పలువురు సీనియర్ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరై చివరిసారిగా నివాళులు అర్పించారు. అంతకుముందు జైట్లీ మృతదేహాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు కైలాస కాలనీలోని ఆయన ఇంటి నుంచి అభిమానులు, కార్యకర్తల నినాదాల మధ్య బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇక్కడ దాదాపు రెండున్నర గంటలపాటు జైట్లీ మృతదేహాన్ని ఉంచిన సందర్భంగా పలు పార్టీల అగ్రనేతలు సహా సాధారణ ప్రజలు, పాఠశాలల విద్యార్థులు సైతం హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. పలువురు నాయకులు భావోద్వేగంతో కన్నీరుమున్నీరయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, ప్రకాష్ జవడేకర్, పియూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ తదితరులు జైట్లీకి చివరిసారిగా నివాళులు అర్పించారు. ‘జైట్లీ మరణం ఎవరూ పూడ్చలేని. ఆయన సేవలు నిరంతం గుర్తుండిపోతాయి’ అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కాగా, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, యోగా గురు రామ్‌దేవ్ కూడా దివంగత నేత జైట్లీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జైట్లీ దేశానికి, సమాజానికి, సామాన్య ప్రజలకు అందించిన అపారమైన సేవలను గుర్తు చేసుకున్నారు.

చిత్రం...అరుణ్ జైట్లీ భౌతికకాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య సంగీతా జైట్లీ, కుమార్తె సోనాలీ జైట్లీ