జాతీయ వార్తలు

సచివాలయం నుంచి కాశ్మీర్ రాష్ట్ర జెండా తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 25: జమ్మూ-కాశ్మీర్‌లో ఇంత కాలం రెపరెపలాడిన ప్రత్యేక హోదా జెండాను ప్రభుత్వం తొలగించింది. జమ్మూ-కాశ్మీర్ సచివాలయంతో సహా అన్ని ప్రభుత్వ భవనాలపై ఉన్న ఆ జెండాలను ఆదివారం తొలగించారు. అంతేకాదు ఇక ఆ జెండాకు స్వస్తి చెప్పారు. రాజ్యాంగంలోని 370-అధికరణ కింద జమ్మూ-కాశ్మీర్‌కు ఇంత కాలం స్వయం ప్రతిపత్తి కల్పించిన సంగతి తెలిసిందే. అయితే మూడు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేస్తూ పార్లమెంటులో ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇలాఉండగా 1952 సంవత్సరం జూన్ 7న జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా ఓ జెండాను రూపొందించుకున్నది.