జాతీయ వార్తలు

యమున ప్రక్షాళన మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: కాలుష్య కారకంగా తయారైన యమునా నది ప్రక్షాళన అంశంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 30 సంవత్సరాలుగా ఎన్నిసార్లు ప్రక్షాళనకు ఆదేశించినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని, కాలుష్యం కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే నది ప్రక్షాళనపై ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్దేశిత గడువును నిర్ణయించి ట్రిబ్యునల్‌కు తెలియజేయాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా నది పరిశుభ్రతపై చర్యలు తీసుకోకపోతే సంబంధిత శాఖలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదివారం పేర్కొంది. ‘ప్రస్తుత కాలుష్యాన్ని వీలైనంత త్వరగా నిర్మూలించి.. యమునా నది పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైని ఉంది’ అని పేర్కొంది. ఎన్‌జీటీతో పాటు అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ఆదేశాలకు అనుగుణంగా ఎప్పటిలోగా యమునా నదిని పూర్తి ప్రక్షాళనను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో నిర్దిష్ట తేదీతో సహా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రభుత్వాలు తెలియజేయాలని ఆదేశించింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజారోగ్యం దెబ్బ తినడమే కాకుండా నది ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు నది ప్రక్షాళనపై అనుసరిస్తున్న వైఖరిపై ఎన్‌జీటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. మూడు రాష్ట్రాలూ పది కోట్ల రూపాయిల చొప్పున పనితీరుపై గ్యారంటీ కోసం చెల్లించాలని ఆదేశించింది. నది ప్రక్షాళనకు కారణమయ్యే పరిశ్రమలను హెచ్చరించాలని కూడా ఆయా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. నది నీటి నాణ్యత, ప్రవాహ స్థితిగతులపై హర్యానా కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం చేయాలని.. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే పరిశ్రమల వివరాలను సేకరించాలని కూడా ఎన్‌జీటీ పేర్కొంది.