జాతీయ వార్తలు

వీడని పీటముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ ఆధ్వర్యంలో శుక్రవారం 10వ షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల విభజనపై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు.
గతంలో సుప్రీంకోర్టు ఉన్నత విద్యామండలి కేసులో వెలువరించిన తీర్పును పదో షెడ్యూల్‌లోని అన్ని సంస్థలకు వర్తింపజేయాలని ఏపీ తరపున హాజరైన ఏపీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, అడ్మిషన్ అండ్ ఫి రెగ్యులేటరీ కమిటి కన్సల్టెంటు బాలసుబ్రమణ్యం కేంద్రానికి తెలిపారు. అయితే దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. ఆ రాష్ట్రం తరపున హాజరైన ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, అడ్వకేట్ జనరల్ రామృష్ణారెడ్డి అలా చేయడం కుదరదని కేంద్రానికి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులో కేవలం ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే ఉన్నందున దానిపై చర్చించాలని తెలిపారు. పదో షెడ్యూల్‌లోని సంస్థలకు ఈ తీర్పును వర్తింపజేయాలని ఏపీ చెప్పడం సరైనది కాదని కేంద్రానికి తెలిపారు. పదో షెడ్యూల్‌లోని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో ఈ రెండు రాష్ట్రాల ప్రతినిధులు వచ్చే నెల 18న మళ్లీ హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టు ఉమ్మడి ఉన్నత విద్యామండలిపై ఇచ్చిన తీర్పుపై తాము త్వరలో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నామని కేంద్రానికి, ఏపీకి తెలంగాణ తరపున హాజరైన ప్రతినిధులు తెలిపారు.