జాతీయ వార్తలు

పిఎస్‌ఎల్‌వికి కౌంట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబరు 24: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుండి ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ శనివారం ఉదయం 8:42 గంటలకు ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం స్కాట్‌శాట్-1, విదేశాలకు చెందిన 5 ఉపగ్రహాలుసహా విశ్వ విద్యాయాల విద్యార్థులు రూపొందించిన మరో రెండు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో
శాస్తవ్రేత్తలు రాకెట్‌లోని నాలుగో దశకు ద్రవ ఇంధనంతోపాటు నైట్రోజన్, హైడ్రోజన్ హీలియం గ్యాస్‌ను నింపే ప్రక్రియను పూర్తిచేశారు. ప్రయోగ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ ఆదివారం షార్‌కు రానున్నారు. కౌంట్‌డౌన్ సజావుగా సాగి అన్నీ అనుకూలిస్తే సోమవారం ఉదయం 9:12గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 35 షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది.