జాతీయ వార్తలు

కరాచీ షోకు వెళ్లను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ షోలు, బాలీవుడ్ సినిమాల్లో నటించి కమెడియన్‌గా గుర్తింపు పొందిన రాజు శ్రీవాత్సవ్ ఉరీ దాడులకు నిరసనగా తన కరాచీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్‌లో అతడి షోలకు మంచి ఆదరణ ఉంది. త్వరలో అక్కడ కొన్ని వినోద కార్యక్రమాల్లో రాజు పాల్గొనాల్సి ఉంది. ఇటీవల కాశ్మీర్‌లో ఉరీ సెక్టార్‌లో భారత సైనిక శిబిరంపై తీవ్రవాదులు చేసి 18మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో పర్యటిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న పాకిస్తాన్ నటీనటులు, కళాకారులను దేశం విడిచివెళ్లాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, శివసేన ఆల్టిమేటం జారీ చేశాయి. ఈ పరిస్థితుల్లో పాక్‌లో నిర్వహించబోయే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తన నిరసన తెలుపుతున్నానని రాజు పేర్కొనడం విశేషం. భారమైన హృదయంతో హాస్యాన్ని పండించమంటే తనవల్ల కాదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆత్మశాంతి కోసం పాక్ షోను రద్దు చేసుకుంటున్నానని అన్నాడు. ఆయన మాటల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో విస్తృత ఆదరణ పొందుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాజు శ్రీవాత్సవ్ గత ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాది పార్టీలో చేరి టిక్కెట్ పొందారు. పోటీకి ముందే పార్టీనుంచి వైదొలగి బిజెపిలో చేరారు.