క్రైమ్/లీగల్

పీపీఏల రద్దు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : సౌర, పవన విద్యుత్ కొనగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను సమీక్షించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కడప, అనంతపురానికి చెందిన మూడు విద్యుత్ కంపెనీలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. పీపీఏలను సమీక్షించడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్తులో అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని కంపెనీలు పేర్కొన్నాయి. పీపీఏలను సమీక్షించడమంటే తమపై నమ్మకం లేకపోవడమేనని వాదించాయి. అందరి వాదనలు విన్న ట్రిబ్యునల్ పీపీఏల రద్దును ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలచిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా అవసరం లేదని ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ జస్టిస్ మంజుల చెల్లుర్ నేతృత్వలోని బెంచ్ స్పష్టం చేసింది.