జాతీయ వార్తలు

చివరి ప్రయత్నం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, సెప్టెంబర్ 24: రెండు దేశాలూ అణ్వస్త్రాలను కలిగి ఉన్నందున భారత్‌కు పాకిస్తాన్‌తో యుద్ధం అనేది చివరి ప్రత్యామ్నాయం కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సూచించారు. కాశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి భారత్ అన్ని రకాలుగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ విడిగా విలేఖరులతో మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రశ్నించారు. భారత్‌కు చిరకాల, సన్నిహిత మిత్రదేశమైన రష్యా కూడా నేడు పాకిస్తాన్‌తో సంయుక్త విన్యాసాలలో పాల్గొంటోందని, గతంలో రష్యా ఎన్నడూ ఇలా చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివన్నీ మనకు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని పేర్కొంటూ, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ పరిణామాలను పరిశీలించాలని, తాను అనుసరిస్తున్న విధానాలపై ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. విదేశాలనుంచి, అంతర్గతంగా దేశ భద్రతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను ఒంటరిపాటు చేసేట్లుగా ప్రచారం చేయాలని ప్రణాళికను రూపొందించుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.