జాతీయ వార్తలు

ప్రత్యేక కౌనె్సలింగ్‌కు ఆదేశించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశవ్యాప్తంగా ఐఐటి, ఐఎస్‌ఎం, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ఐటిలలో ఖాళీగా ఉన్న వేలాది సీట్లను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఒక లేఖను ఆయన ప్రధానికి రాశారు. ఇప్పటికే ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఆరు విడతలలో కౌనె్సలింగ్ జరిగినా దేశవ్యాప్తంగా ఐఐటిల్లో 73, ఐఎస్‌ఎంల్లో 23, ఎన్‌ఐటిల్లో 1518, ట్రిపుల్ ఐటిల్లో 407, ఇతర జాతీయ స్థాయి సాంకేతిక విద్యాసంస్థల్లో 1174 సీట్లు ఖాళీగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీకి ప్రత్యేక కౌనె్సలింగ్‌ను నిర్వహించాలని, అర్హులైన విద్యార్థులతో సీట్లను భర్తీ చేయాలని లేఖలో కోరారు. గత సంవత్సరం కూడా ఇలాగే సీట్లు ఖాళీగా ఉంటే ప్రత్యేక కౌనె్సలింగ్ జరిపారని, కాని ఈ ఏడాది మాత్రం అలా చేయలేదన్నారు. ఈ ఖాళీ సీట్ల భర్తీ సమస్యకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇప్పటి వరకు పరిష్కారం కనుక్కోలేక పోవడం దురదృష్టకరం అని లేఖలో పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉండటం అర్హులైన విద్యార్థులు జీవితాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ సీట్లు భర్తీ కాకుండా ఉండటం వల్ల ఖజానాకు కూడా నష్టమేనని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొంది, వివిధ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరేందుకు అవకాశం కల్పించాలన్నారు. ప్రత్యేక కౌనె్సలింగ్ నిర్వహించేలా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఈ లేఖలో కెవిపి కోరారు.