జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో పుంజుకున్న ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను తొలగించటం వలన కాశ్మీర్, లడఖ్ రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం ఊపందుకుంటుందని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ఉప రాష్ట్రపతి నిలయంలో జమ్మూకాశ్మీర్ నుండి వచ్చిన సర్పంచులు, పంచాయతీ సభ్యులతో ఆయన మంగళవారంనాడు సమావేశమయ్యారు. 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు కావటం వలన జమ్మూకాశ్మీర్‌లోని స్థానిక సంస్థలకు పెద్ద ఎత్తున నిధులందుతాయని, తద్వారా మరింత పటిష్టమవుతాయని వెంకయ్యనాయుడు చెప్పారు. ఆర్టిల్ 370 తాత్కాలికమైనదని, కొంత సమయం కోసం ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ పాలనలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని 4,483 నుండి 3,500 పంచాయతీలను ఎన్నుకోవటం అభినందనీయమన్నారు. ఆర్టికల్ 370 రద్దు వలన పంచాయతీలకు నిధులు, విధులు, సిబ్బంది లభిస్తాయన్నారు. పంచాయతీల ఆర్థిక బలాన్ని పదింతలు పెంచటం వలన ఇప్పుడది లక్ష రూపాయలకు పెరిగిందన్నారు. పన్నులు విధించటం ద్వారా తమ నిధులను పెంచుకునే అధికారం పంచాయతీలకు ఉన్నదని వెంకయ్యనాయుడు తెలిపారు. పంచాయతీలకు ఇప్పుడు ఐసీడీఎస్, పీఎంఏవై కార్యక్రమాలను ఆడిట్ చేసే అధికారం కూడా లభించిందన్నారు. పంచాయతీలకు నిధులు, సిబ్బంది లభించటం వలన మూడంచెల వ్యవస్థ బాగా పటిష్టం అవుతుందన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవటం వలన జమ్మూకాశ్మీర్ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు కోల్పోతూ ఉండేదన్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగినందువలన ఆర్థిక సంఘం ఇచ్చే వేలాది కోట్లు జమ్మూకాశ్మీర్‌కు లభిస్తాయన్నారు. స్థానిక సంస్థలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఎన్నికలు జరిపించాలని ఆయన సూచించారు. ఇకమీదట పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే పాకిస్తాన్‌తో చర్చలు జరుగుతాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

చిత్రం...జమ్మూకాశ్మీర్ సర్పంచ్‌లు, సభ్యులతో న్యూఢిల్లీలో మంగళవారం సమావేశమైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు