జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో మిలిటెంట్ రిక్రూట్‌మెంట్లు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 11: కాశ్మీర్‌లో తాజాగా ఎలాంటి మిలిటెంట్ రిక్రూట్‌మెంట్‌లు జరగలేదని డీజీపీ దిల్‌బగ్ సింగ్ వెల్లడించారు. బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో సింగ్ మాట్లాడుతూ అక్కడక్కడా కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇందులో భాగంగానే దక్షిణ కాశ్మీర్‌లో పండ్ల వ్యాపారులను బెదిరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దీంతో పోలీసు వ్యవస్థ అప్రమత్తం అయ్యిందని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పించడం తమ విధి నిర్వహణలో భాగమని స్పష్టం చేశారు. ‘తాజాగా కాశ్మీర్‌లో ఎలాంటి ఉగ్రవాద రిక్రూట్‌మెంట్‌లు జరగలేదు.. గతంలో కొంతమంది ఇటువంటి జరుగుతున్నాయంటూ వదంతులు సృష్టించారు.. అయితే, అప్పట్లో ఉగ్రవాదం వైపు మొగ్గు చూపే యువతలో చాలామందిని వెనక్కి తీసుకురాగలిగామని’ డీజీపీ వివరించారు. పాక్ నుంచి చొరబాట్లు జరుగుతున్నాయన్న సంగతి మా దృష్టికి వచ్చిందనీ.. గుల్‌మార్గ్ సెక్టార్‌లో ఇద్దరు పాక్ టెర్రరిస్టులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకొన్నాయని చెప్పారు. కాశ్మీర్‌లో అస్థిరత సృష్టించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు, అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు పాక్ యత్నిస్తోందని.. వీటిని చాకచక్యంగా భద్రతా దళాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గత నెల 21న గుల్‌మార్గ్ సెక్టార్‌లో లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు ఇద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకొన్నాయని చెప్పారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారనీ.. ఉద్యోగులు కార్యాలయాలకు స్వేచ్ఛగా వెళ్తున్నారని డీజీపీ చెప్పారు. దక్షిణ కాశ్మీర్‌లో పండ్ల వ్యాపారులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి వాస్తవమేనని.. ప్రజలకు రక్షణ కల్పించడంలో తమవంతు పాత్ర నిర్వహిస్తున్నామని.. ఎవరూ భయపడనవసరం లేదని డీజీపీ పిలుపునిచ్చారు. ప్రజలు ఇవి చేయాలని.. ఇవి చేయకూడదని తాము ఎక్కడా పోలీసులు చెప్పడం లేదని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ నుంచి బుధవారం 230 ట్రక్ లోడ్‌ల పండ్లను ఎగుమతి చేశారని ఈ సందర్భంగా సింగ్ స్పష్టం చేశారు.