జాతీయ వార్తలు

కాఫీ తోటల్లో.. కిలకిలారావాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 26: మన దేశంలో పశ్చిమ కనుమలు అరుదైన పక్షులకు సురక్షిత ఆవాసంగా మారాయి. పశ్చిమ కనుమల్లోని కాఫీ, రబ్బరు, పోక తోటల్లో పదమూడు అత్యంత అరుదైన రకాలతోపాటు రెండు వందల రకాల పక్షులు ఈ తోటల్లో విహరిస్తున్నాయని జంతు శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. 30వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన 187 తోటల మధ్య రెండేళ్లపాటు తీవ్ర పరిశోధన చేసిన అనంతరం ఆ ఫలితాలను ప్రకటించారు. వన్యప్రాణి సంరక్షణ సంస్థకు చెందిన డాక్టర్ కీర్తి కె కారంత్ నేతృత్వంలో పరిశోధకులు పశ్చిమ కనుమల్లోని పక్షుల గురించి రీసర్చ్ చేశారు. ఈ పరిశోధనల్లో మొత్తం 204 రకాల పక్షులను గుర్తించారు. వీటిలో 170 రకాలు ఇక్కడే శాశ్వతంగా ఆవాసముంటున్నట్లు కనుగొన్నారు. వీటిలో 13రకాలు అత్యంత అరుదైనవని కారంత్ వెల్లడించారు. ఎక్కువ పక్షులు కాఫీ తోటల్లోనే అధికంగా ఉంటున్నాయని కూడా పేర్కొన్నారు. దట్టంగా పెరిగిన తోటల్లోనే ఎక్కువగా పక్షులు ఉంటున్నాయని తమ పరిశోధనల్లో తేలిందన్నారు. పక్షి జాతుల సంరక్షణకు ఇలాంటి తోటలుండే వాతావరణాన్ని ఏర్పాటు చేయటం అత్యవసరమని తమ పరిశోధనపై పత్రాన్ని సమర్పించిన శశాంక్ దాల్వి తెలిపారు.