జాతీయ వార్తలు

చైనా-భారత్ మధ్య స్వల్ప ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఈశాన్య లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు పరీవాహక ప్రాంతంపై భారత్-చైనా భద్రతా దళాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణానికి తాత్కాలికంగా తెరపడింది. అయితే, ఈ అంశం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని మిలిటరీ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. పాంగాంగ్ సరస్సు పరీవాహక ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో చైనా భద్రతా దళాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. స్వల్ప ఘర్షణల నేపథ్యంలో ఇరువైపులా పెద్దఎత్తున అదనపు బలగాలను మోహరించాయి. అయితే, ఇరువైపుల అధికారుల బృందం చర్చలు జరిపిన అనంతరం వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, సరస్సు పరిధిలోని మూడింట రెండొంతుల భాగంగా చైనా పరిధిలోనే ఉంది. నియంత్రణ రేఖ పొడవునా ఇరువైపులా నెలకొన్న వివాదాల పరిష్కారానికి నిర్దిష్ట అధికార యంత్రాంగం ఉందని ఆర్మీ అధికారులు చెప్పారు. 2017లో భారత్‌వైపు డొక్లాం వద్ద వివాదాస్పద ప్రాంతం లో రోడ్డు నిర్మాణంపై చైనా సైన్యం అభ్యంతరం వ్యక్తం చేయడంతో దానిని భారత్ నిలిపివేసింది.
అప్పట్లో 73 రోజుల పాటు ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.