జాతీయ వార్తలు

మంచి వర్శిటీలకు స్వయం ప్రతిపత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాం, సెప్టెంబర్ 26: దేశంలో ఉన్నత విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ప్రమాణాలు పాటిస్తున్న విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని యోచిస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్ సోమవారం వెల్లడించారు. సమర్థవంతంగా పనిచేయని విద్యా సంస్థలను క్రమబద్ధం చేయనున్నట్టు ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయాలను పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం చేయూతనిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమని జావడేకర్ తెలిపారు. ‘మెరుగైన ఫలితాలు సాధిస్తున్న విశ్వవిద్యాలయాలకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది. స్వయం ప్రతిపత్తిని ఇవ్వడంతోపాటు నిబంధనలు సడలిస్తుంది. అలాగే పనితీరు సరిగ్గాలేని విశ్వవిద్యాలయాలను దారిలో పెట్టడానికి భారీగా సంస్కరణలు తీసుకొస్తున్నాం’ అని మానవ వనరుల మంత్రి తెలిపారు. అమృత యూనివర్శిటీ రూపొందించిన ‘ఓషన్ నెట్’ను ప్రారంభించిన జావడేకర్ సుముద్రంలో వేటకు వెళ్లే జాలర్లకు ఇదెంతో ఉపయోగకారి అవుతుందని చెప్పారు. ఆధ్యాత్మిక గురువు మాతా అమృతామయి 63వ జయంతి సందర్భంగా అమృతాపురిలో ఓషన్ నెట్‌ను మంత్రి ప్రారంభించారు. కొత్త కొత్త పరిశోధనలు, అనే్వషణలతోనే దేశం ముందుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యంతో వర్శిటీల్లో కొత్త ఆవిష్కరణలు రావాలని, కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించిందని ఆయన వివరించారు. ఓషన్ నెట్ లాంటివి మరిన్ని రావాలని జావడేకర్ ఆకాంక్షించారు. ఇలాంటి ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం తన విధిగా మంత్రి చెప్పారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య అన్నది రాజకీయ అజెండా కాదని, అది జాతీయ అజెండా అని మానవ వనరుల మంత్రి పేర్కొన్నారు.

చిత్రం.. అమృత యూనివర్శిటీ రూపొందించిన ‘ఓషన్ నెట్’ను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి జావడేకర్. చిత్రంలో మాతా అమృతామయి, కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ