జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా సుప్రీం బెంచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: దేశ వ్యాప్తంగా ప్రజల సౌలభ్యం కోసం వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇలా చేయడం వల్ల తమ కేసుల కోసం ఢిల్లీ వరకు రావల్సి ఉండదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించినట్లుగా ప్రారంభ ప్రాతిపదికన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్‌రాయ్ రాసిన ‘రీథింకింగ్ గుడ్ గవర్నెన్స్’ అనే పుస్తకావిష్కరణ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. అన్నిచోట్ల సుప్రీం బెంచ్‌లు అందుబాటులో ఉండడం వల్ల కక్షిదారులకు ఎంతో సౌలభ్యకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఈ బెంచ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఢిల్లీ వరకు రావల్సిన అవసరం ఉండదని.. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాలని వెంకయ్య కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనాల విస్తరణకు రాజ్యాంగమే వీలు కల్పించిందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం కొత్తగా ఎలాంటి శాసనాన్ని తీసుకురావల్సిన అవసరం లేదన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో లక్షలు, కోట్ల మేర కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయని.. దీని దృష్ట్యా న్యాయవ్యవస్థను ప్రజల ముంగిళ్లకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులోనే 60వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే, వివిధ హైకోర్టుల్లో 40 లక్షలకు పైగా కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయని వెల్లడించిన ఆయన, ఇక దేశ వ్యాప్తంగా దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు మూడు కోట్లకు పైనేనని తెలిపారు. ఎన్నికల పిటిషన్, రాజకీయ నాయకులపై దాఖలయ్యే క్రిమినల్ కేసులు, ఫిరాయింపు కేసులను ఉన్నత న్యాయస్థానాల్లోనూ ప్రత్యేక బెంచ్‌లు సత్వర ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. ఇందుకు అవసరమైతే ప్రత్యేక బెంచ్‌లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. సమాచార టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ-ఫైలింగ్, ఆన్‌లైన్‌లో కేసుల నిర్వహణకు కూడా అవకాశం కల్పించాలన్నారు. ఆ న్యాయ ప్రక్రియ ప్రజానుకూలంగా ఉండాలని పేర్కొన్న ఆయన.. ‘న్యాయం జరగడంలో జాప్యం జరిగితే న్యాయం జరగనట్లే’ అన్న సూక్తిని ఉటంకించారు. న్యాయపరమైన జాప్యాన్ని తొలగించి న్యాయ పాలనా వ్యవస్థకు పదును పెట్టడమే ఇందులో తీసుకురావల్సిన అత్యవసర సంస్కరణ అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.