జాతీయ వార్తలు

41వ రోజూ అదే పరిస్థితి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 14: జమ్మూకాశ్మీర్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఆర్టికల్ 370 రద్దుచేసి శనివారానికి 41 రోజులైంది. ఇప్పటికీ రోడ్లపై జన సంచారం కనిపించడం లేదు. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, విద్యా సంస్థలు తెరుచుకోలేదు. రోడ్లపై ప్రభుత్వం వాహనాలు జాడేలేదు. శుక్రవారం హజ్రత్‌బాల్‌లో ప్రాంతంలో విధించిన ఆంక్షలు సడలించినట్టు అధికారులు వెల్లడించారు.
కాశ్మీర్‌లోయలోనే అనేక ప్రాంతాల్లో ఆంక్షలు తొలగించారు. శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం బలగాల మోహరింపుకొనసాగుతునే ఉంది. జమ్మూకాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తరువాత ఆగస్టు 5న తొలిసారి నిషేధాజ్ఞలు విధించింది కాశ్మీర్ లోయలోనే. పరిస్థితులు చక్కబడ్డాయని భావించిన తరువాత దశలవారీగా ఆంక్షలు సడలించడం మొదలైంది. అయితే శుక్రవారం ప్రార్థనలు సందర్భంగా సున్నితమైన ప్రాంతాల్లో ఆంక్షలు అమలుచేస్తున్నారు. అలాగే పెద్ద మసీదుల్లో మాత్రం ప్రార్థనలకు అనుమతించడం లేదు. నౌహట్టాలోని జామియా మసీదు, హజ్రత్‌బాల్‌లోని దర్గాషరీఫ్ నెల రోజులుగా ప్రార్థనలకు నోచుకోలేదు. ఏది ఏమైనా కాశ్మీర్‌లోయలో శనివారం పౌరజీవనం స్తంభించింది. దుకాణాలన్నీ మూసే ఉన్నాయి. వాహనాలు లేక రహదారులు వెలవెలాపోయాయి. ఇంటర్నెట్ ఎక్కడా పనిచేయలేదు. లోయలో ల్యాండ్ ఫోన్లు పనిచేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, హంద్వారాలో మాత్రం మొబైల్ ఫోన్లు వాయిస్ కాల్స్ పనిచేసినట్టు చెబుతున్నారు. విద్యా సంస్థలు తెరవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు అంత సానుకూలంగా లేరు.
కాశ్మీరీ వేర్పాటువాద నాయకులు అనేక మంది ఇప్పటికీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం కొనసాగుతునే ఉంది.
మామూలు రోజుల్లో ఈ ప్రాంతం పండ్లు, ఫలాలు అమ్మేవారితో కిటకిటలాడిపోయేది. కానీ రాష్ట్రంలో అమలవుతున్న ఆంక్షల కారణంగా బోసిపోయింది.
చిత్రం... ఫ్రూడ్ మండీగా పేర్కొనే ఈ ప్రాంతంలో ఓ మహిళ ఖాళీ సీసాలను ఏరుకుంటోంది.