జాతీయ వార్తలు

ఆరుగురు జెఎంబి ఉగ్రవాదుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్పూర్, సెప్టెంబర్ 26: రెండేళ్ల క్రితం సంభవించిన బర్ద్వాన్ పేలుళ్ల కేసు దర్యాప్తులో పోలీసులు గొప్ప పురోగతి సాధించారు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా భావిస్తున్న పోలీసులు ఆ సంస్థకు చెందిన ఆరుగురు మిలిటెంట్లను సోమవారం పశ్చిమ బెంగాల్, అస్సాంలలో అరెస్టు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అరెస్టయిన ఆరుగురు ఉగ్రవాదుల్లో అయిదుగురి కోసం బర్ద్వాన్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గాలిస్తోంది. కోల్‌కతా పోలీసు శాఖలోని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) చాలా కాలంగా ఈ ఉగ్రవాదుల కదలికలపై నిఘా వేసి, ఎట్టకేలకు సోమవారం వారిని అరెస్టు చేసింది. అరెస్టయిన ఆరుగురిలో ముగ్గురు బంగ్లాదేశ్‌కు చెందినవారు కాగా, మరో ముగ్గురు భారతీయులు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు.. ఉగ్రవాదుల వద్ద నుంచి డెటొనేటర్లు, కేబుళ్లు, మొబైల్ ఫోన్లతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా దేశంలో మరో పెద్ద ఉగ్రవాద దాడిని భగ్నం చేసినట్లు ఎస్‌టిఎఫ్ పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ఎన్నికయిన ప్రభుత్వం మీద, సరిహద్దులోని భారత రాష్ట్రాలలో మరిన్ని దాడులు చేయడానికి అరెస్టయిన ఉగ్రవాదులు ప్రణాళిక రూపొందించుకొని ఉన్నారని తెలిపింది. 2014 అక్టోబర్‌లో జరిగిన బర్ద్వాన్ పేలుళ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఎన్‌ఐఎ అధికారులు ఈ ఆరుగురు ఉగ్రవాదులను ఇంటరాగేట్ చేయనున్నారు. జెఎంబితో భారత్‌కు చెందిన బోడో మిలిటెంట్లకు సంబంధాలు ఉన్న విషయం కూడా వీరి అరెస్టుతో వెలుగుచూసింది. బర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఎన్‌ఐఎ ఇదివరకే 21మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది.

చిత్రం.. ఎన్‌ఐఏకు చిక్కిన జెఎంబి ఉగ్రవాదులను కోర్టుకు తీసుకువస్తున్న దృశ్యం