జాతీయ వార్తలు

పౌష్టికాహార లోపాన్ని అరికట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పౌష్టికాహార లోపాన్ని నిరోధించేందుకు గట్టిగా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా మురికివాడల్లో నివసిస్తున్నవారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించే చర్యలు చేపట్టాలని, అలాగే వలస జనాభా అవసరాలను కూడా తీర్చాలని కేంద్రం స్పష్టం చేసింది. పౌష్టికాహార కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పోషణ్ అభియాన్’లో భాగంగా ఈ చర్యలు చేపట్టాలని కోరింది. నెల రోజులపాటు ఈ కార్యక్రమం అమలవుతుంది. పట్టణ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపానికి ప్రధాన కారణం పేదల జనాభా పెరగడం, సురక్షిత ఆహారం లేకపోవడం, అనారోగ్యకర వాతావరణ ప్రబలడమేనని కేంద్రం తెలిపింది. పట్టణాల్లో వలస జనాభా, మురికివాడల్లో నివసించేవారికి ఆరోగ్య, పౌష్టికాహార సేవలను అందుబాటులోకి తేవాలని రాష్ట్రాలను కోరింది. ఈమేరకు రాష్ట్రాలతోపాటు జిల్లా అధికారులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఓ నోట్ పంపింది. పోషణ్ అభియాన్‌లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధికారులు బాధ్యత వహించాలని కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా వలస జనాభా, మురికివాడల్లో నివసిస్తున్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. అన్ని విభాగాలు, పట్టణ ఆరోగ్య మిషన్ల మధ్య సమన్వయం సాధించాలని, స్వచ్ఛ్భారత్ సందేశాన్ని బలంగా వ్యాపింపజేయాలని కోరింది. ప్రతిఒక్కరికీ పోషణ అభియాన్ గురించి అవగాహన కలిగేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయాలని, అలాగే అనీమియా శిబిరాలను కూడా నిర్వహించాలని రాష్ట్రాలను కోరింది. ముఖ్యంగా పట్టణాల్లోని మురికివాడల్లో పోషణ్ అభియాన్ గురించి ఇంటింటికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
చిత్రం... మధురలో శనివారం అంగన్‌వాడి కార్యకర్తల పౌష్టికాహార ర్యాలీని ప్రారంభిస్తున్న బీజేపీ ఎంపీ, బాలివుడ్ నటి హేమమాలిని