జాతీయ వార్తలు

అరిజోనాలో ఇన్ఫోసిస్ సెంటర్..అమెరికన్లకే ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికాలోని అరిజోనాలో ఒక టెక్నాలజి అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను నెలకొల్పింది. 2023 నాటికి రాష్ట్రంలో వెయ్యి మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రణాళిక రూపొందించుకుంది. రెండేళ్ల కాలంలో పది వేల మంది అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఇన్ఫోసిస్ 2017లో ప్రకటించింది. ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు తెలిపింది. అరిజోనా టెక్నాలజి అండ్ ఇన్నోవేషన్ సెంటర్.. అటానమస్ టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఫుల్-స్టాక్ ఇంజినీరింగ్, డాటా సైన్స్ అండ్ సైబర్‌సెక్యూరిటీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పనిచేస్తోందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అరిజోనాలో ఇన్ఫోసిస్ పెట్టుబడుల వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల ప్రతిభ కలిగిన వారితో పాటు స్థానికంగా ప్రతిభ కలిగిన వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆ కంపెనీ వివరించింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని, ఈ కేంద్రం 2020 నాటికి ఏఎస్‌యూ నోవస్ ఇన్నోవేషన్ కారిడార్‌లోని 60వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల పర్మనెంట్ లొకేషన్‌లోకి తరలుతుందని, అక్కడ 500 మంది ఉద్యోగులు పనిచేయడానికి సౌకర్యాలు ఉంటాయని ఆ ప్రకటనలో వివరించింది. ‘