జాతీయ వార్తలు

కట్టు దాటితే ఖబడ్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటం నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం పాకిస్తాన్‌ను హెచ్చరించింది. విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. 2003లో రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తు.చ. తప్పకుండా పాటించటం ద్వారా వాస్తవాధీన లేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద శాంతిని నెలకొల్పాలని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పాకిస్తాన్ సైన్యం ఈ సంవత్సరం ఇంతవరకు 2050సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జరిపిన కాల్పుల్లో 21 మంది భారతీయులు మరణించారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. పాక్ కాల్పుల ఉల్లంఘనకు ప్రతిగా భారత సైనికులు జరిపిన ఎదురు కాల్పుల్లో మరణించిన ఇద్దరు పంజాబీ ముస్లిం సైనికుల మృతదేహాలను బల ప్రదర్శన ద్వారా స్వాధీనం చేసుకునేందుకు పాకిస్తాన్ సైన్యం రెండు రోజులపాటు జరిపిన ప్రయత్నాలను భారత సైనికులు వమ్ము చేశారు. దీనితో గత శుక్రవారం తెల్లజెండా ఊపుతూ ముందుకు వచ్చి రెండు రోజుల నుండి పడి ఉన్న తమ సైనికుల మృతదేహాలను తీసుకుపోయారు. తెల్లజెండా ప్రదర్శించటంతో మృత సైనికుల శవాలను తీసుకుపోయేందుకు భారత సైన్యం అంగీకరించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సైనికుల శవాలను గౌరవించటం భారత సైన్యం సంప్రదాయమని.. పాక్ సైన్యం ఎదురు కాల్పుల్లో మరణించే పంజాబీ ముస్లిం సైనికుల శవాలను మాత్ర మే తీసుకుపోతుంది తప్ప ఎదురు కాల్పుల్లో మరణించే తమ దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన సైనికుల మృతదేహాలను తీసుకునేందుకు ఇష్టపడదని తెలిపింది. పాకిస్తాన్ సైన్యం గత జూలైలో కెరణ్ సెక్టార్‌లో చొరబాటుదారులను పంపించేందుకు జరిపిన ప్రయత్నాన్ని భారత సైన్యం వమ్ము చేసింది. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో పాక్ సైన్యానికి చెందిన ఐదుగురు బార్డర్ యాక్షన్ టీమ్ సైనికులు మరణించా రు. వీరి మృతదేహాలు ఇప్పటికీ అక్కడే పడి ఉన్నా యి. బహుశా వీరు పంజా బీ ముస్లిం సైనికులు అయి ఉండరని విదేశీ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది. భారత్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా పాక్ సైన్యం ఈ విధం గా కాల్పు ల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటం శోచనీయమని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పాక్ సైన్యం ఇటీవల తమ సరిహద్దుల్లో అదుపు బలగాలను మోహరిస్తోంది.. ఈ సమయంలో కాల్పుల విరమణ ఒపందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రకటనలో తెలిపింది. పాక్ సైన్యం ఉగ్రవాదులను పంపించేందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.. పాకిస్తాన్ పాల్పడే దురాగతాలకు భారత సైన్యం సరైన జవాబు చెబుతోంది.. భారత సైన్యం అత్యంత సంయమనంతో వ్యవహరిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.