జాతీయ వార్తలు

ఉపాధి ఫుల్.. అర్హతే నిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 15: దేశంలో ఉపాధి అవకాశాలకు కొదవ లేదని, అయితే ఉత్తర భారతానికి సంబంధించినంత వరకు ఖాళీలను భర్తీ చేయడానికి ‘అర్హులైన’ వ్యక్తుల కొరత తీవ్రంగా ఉందని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ అన్నారు. అనేక భారతీయ కంపెనీల నుంచి ఉత్తర భారతానికి సంబంధించి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయని ఆయన అన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరాదిలో నిపుణులైన వ్యక్తులు లేరంటూ ఈ ప్రాంతాన్ని కేంద్ర మంత్రి అవమానించారంటూ ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందన్న విమర్శల నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి అవకాశాలకు సంబంధించి రోజువారీగా వార్తాపత్రికల్లో కథనాలు వస్తూనే ఉంటాయని, వాటిని తాను లోతుగా గమనించడమే కాకుండా సమస్య ఏమిటో కూడా అర్థం చేసుకున్నానని మంత్రి అన్నారు. అయితే, తమ కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఉత్తరాదికి వెళ్లే సంస్థల నుంచి ‘అక్కడ నాణ్యత లేదు’ అన్న వాదనే గట్టిగా వినిపిస్తోందని ఆయన తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక ‘ఆర్థిక మాంద్యం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామన్న వాస్తవం నుంచి ప్రజల దృష్టిని తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేస్తోంది’ అని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటిపోతున్నా ఇంతవరకు ఉపాధి సృజనే లేదని ప్రియాంక అన్నారు. ఉన్న ఉపాధి అవకాశాలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల కొట్టుకుపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఉత్తర భారతీయులను అవమానించడం వల్ల నిరుద్యోగ సమస్య తీవ్రత నుంచి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆమె అన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. ఆర్థిక మాంద్యం వంటి తీవ్ర అంశం విషయంలోనే పలువురు కేంద్ర మంత్రులు హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇపుడు నిరుద్యోగ సమస్యపై కూడా ఉత్తర భారతీయులకు సమర్థత లేదని కేంద్ర మంత్రి మాట్లాడడం విడ్డూరమని ఆమె అన్నారు. అత్యంత సిగ్గుచేటైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు.

*చిత్రం...కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్