జాతీయ వార్తలు

తీరు మారకుంటే చిదంబరం గతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బల్లియ, సెప్టెంబర్ 15: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రవర్తనను, అసభ్యంగా మాట్లాడుతున్న భాషను వెంటనే మార్చుకోవాలని ఉత్తర్ ప్రదేశ్‌లోని బైరియా అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ హెచ్చరించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు. శనివారం ఇక్కడ ఏర్పాటైన ‘కృషి మేళా ఉత్సవంలో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్రం చేపట్టిన ‘జాతీయ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)’ కార్యక్రమాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారంటే ఆమె బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కావాలన్నారు. జాతీయ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్‌ను ఆమె వ్యతిరేకిస్తున్నారంటే తప్పని సరిగా ఆమె వెనుక విదేశీ శక్తుల హస్తం ఉండి ఉంటుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మమత బెనర్జీకి దురదృష్టకరమైన చెడ్డ రోజులు వస్తున్నాయని తెలుసుకోలేక పోతున్నారని ఆయన అన్నారు. మమత బెనర్జీ వెంటనే తన భాషను, ప్రవర్తనను మార్చుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరానికి ఎదురైన విధి పరిస్థితులనే ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఈ నెల 13న మమతా బెనర్జీ కోల్‌కత్తాలో జాతీయ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్‌ను వ్యతిరేకిస్తూ ఊరేగింపు నిర్వహించారని ఆయన తెలిపారు. అస్సాంలో నిర్వహించిన రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్‌లో 19 లక్షల పేర్లు లేవన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న వారికి మద్దతుగా మమత నిలిచి రాజకీయం చేయాలనుకుంటున్నారా?, బంగ్లాదేశ్ ప్రధాని కావాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పశ్చిమ బెంగాల్‌లో శ్రీ రామునిలా, హనుమంతునిలా రాబోతున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార మార్పు అనివార్యమని ఎమ్మెల్యే సురేంద్రసింగ్ అన్నారు.