జాతీయ వార్తలు

న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: కావేరీ జలాల వివాదం సోమవారం అనూహ్యమైన మలుపు తిరిగింది. తమ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా జలాలు లేవంటూ తమిళనాడు పిటిషన్ దాఖలు చేస్తే.. రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని ఇవ్వలేమని, గతంలో ఇచ్చిన తీర్పు సవరించాలంటూ కర్ణాటక కూడా పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు తమ అవసరాలు, పరిస్థితులను విశదీకరిస్తూ ఈ పిటిషన్లలో వాదనలు వినిపించాయి. ఉభయ రాష్ట్రాలూ భిన్నమైన డిమాండ్లను తెరపైకి తేవటంతో సుప్రీం తదుపరి తీర్పు ఉత్కంఠగా మారింది. సుప్రీం కోర్టు సెప్టెంబర్ 20న ఇచ్చిన ఆదేశాల మేరకు తమిళనాడుకు రోజూ ఆరువేల క్యూసెక్కుల కావేరీ జలాలను ఇవ్వజాలమని, ఈ తీర్పును సవరించాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. తమిళనాడుకు సెప్టెంబర్ 27వరకు ప్రతిరోజూ 6వేల క్యూసెక్కుల జలాలను విడుదల చేయాల్సిందిగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వారం క్రితం కర్ణాటకను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కావేరీ బేసిన్‌లో తగినంత జలాలు లేవని, తమ రాజధాని బెంగళూరు సహా పలు నగరాలకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి ఉందని కర్ణాటక సుప్రీం కోర్టు ధర్మాసనానికి వివరించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం తమ జలాశయాలు పూర్తిగా నిండుకున్నాయని, కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సైతం ఉల్లంఘిస్తోందని తన పిటిషన్‌లో ఆరోపించింది. కర్ణాటక తనకు తానే న్యాయమూర్తిగా భావిస్తూ, కోర్టు పరిధిలోని అంశాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని విమర్శించింది. అంతకుముందు సెప్టెంబర్ 15న రోజుకు 15వేల క్యూసెక్కులు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం, ఆ తరువాత ఇచ్చిన తీర్పులో రోజుకు 12వేల క్యూసెక్కులు విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో తమిళనాడు, కర్ణాటకల్లో పెద్దఎత్తున హింసాకాండ రేగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆ తీర్పును ఆరువేల క్యూసెక్కులు విడుదల చేయాలంటూ సూచించింది. ఆ మేరకు కూడా నీటిని విడుదల చేయలేమంటూ సుప్రీం కోర్టును కర్ణాటక కోరింది.