జాతీయ వార్తలు

నక్సలైట్ల చేతిలో బస్సు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజాపూర్, సెప్టెంబర్ 15: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు ఆదివారం ఒక బస్సును దగ్ధం చేశారు. కొంత సేపటికి అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరిపారు. ఉసూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని భద్రతా దళాలకు చెందిన సీతాపూర్ క్యాంప్‌కు సమీపంలో సాయంత్రం నాలుగు గంటలకు నక్సలైట్లు ఒక ప్రైవేటు బస్సును ఆపివేశారు. అనంతరం అందులో ఉన్న ప్రయాణికులను కిందికి దింపి, బస్సుకు నిప్పు పెట్టారు. ప్రయాణికులు ఎవరికీ గాయాలు అయినట్టు సమాచారం లేదు. బస్సు ఉసూర్ నుంచి బీజాపూర్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన జరిగింది. బస్సుకు నిప్పు పెట్టిన తరువాత నక్సలైట్లు కొంత సేపు అక్కడే పొంచి ఉన్నారు. కొద్ది సేపటి తరువాత అక్కడికి భద్రతా బలగాలు చేరుకోగానే వాటిపైకి నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు కాల్పులు, ఎదురు కాల్పులు జరిగాయి. ఆ తరువాత నక్సలైట్లు పక్కనే ఉన్న అడవుల్లోకి పారిపోయారు. ఇరు వర్గాల్లో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.