జాతీయ వార్తలు

ఎంసెట్ కౌనె్సలింగ్‌కు నెల గడువు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26:వైద్య కళాశాల సీట్ల కౌనె్సలింగ్ నిర్వహణకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా తెలంగాణకు గడువు పొడిగిస్తే ఏపీ వైద్య కళాశాలల సీట్ల కౌనె్సలింగ్‌కు సైతం గడువు పొడిగించాలంటూ ఏపీ ప్రైవేటు మెడికల్, దంత వైద్య కళాశాలల యాజమాన్య సంఘం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రానున్నాయి. నీట్ కేసు విచారణ తుది ఆదేశాలలో ఈనెల 30నాటికి కౌనె్సలింగ్ పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ -3 నిర్వహించింది. దాంతో తెలంగాణలో కౌనె్సలింగ్ ఆలస్యమైంది. సెప్టెంబరు నాటికల్లా కౌనె్సలింగ్ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితులు లేనందున మరికొంత సమయం కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.