జాతీయ వార్తలు

కొండేగావ్‌లో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 26: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, కొండగావ్ జిల్లాల్లో సోమవారం వేర్వేరుగా జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణ్‌పూర్ జిల్లా తోయ్‌నార్ అటవీ ప్రాంతంలో డిఆర్‌జీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. సుమారు గంటసేపు కాల్పులు జరిగాయి. సంఘటన ప్రదేశంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని కమాండర్లు తిరుపతి, లోకేశ్‌లుగా గుర్తించారు. మరో ఎన్‌కౌంటర్ కొండగావ్ జిల్లా మర్దాపాల్ హకాలీ కోర్సేనార్ అడవుల్లో జరిగింది. ఆర్‌జి, డిఆర్‌జి, ఐటిబిపి బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు వీరిపై కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా 12 బోర్ తుపాకీ, డిటోనేటర్లు, విప్లవ సాహిత్యం లభ్యమయ్యాయని పోలీసులు వివరించారు.

చిత్రం.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు. పోలీసులకు లభించిన ఆయుధాలు