జాతీయ వార్తలు

అవసరమైతే కాశ్మీర్ వెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కాశ్మీర్‌లో పరిస్థితులు తెలుసుకోడానికి అవసరమేతే తానే అక్కడికి వెళ్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. ‘ప్రజలు న్యాయస్థానానికి వెళ్లడానికే ఇబ్బంది పడుతున్నారంటే, తీవ్రమైన విషయమే. ఈ విషయంపై జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతా’అని రంజన్ గొగోయ్ ప్రకటించారు. ‘అసరమైతే నేనే కాశ్మీర్ వెళ్లి పరిస్థితి సమీక్షిస్తా. అక్కడ ఏం జరుగుతున్నదీ తక్షణం నివేదిక ఇవ్వండి’అని హైకోర్టును ఆదేశించారు. ప్రజలు న్యాయస్థానాలకు వెళ్లకుండా ఇబ్బందులు కలగజేస్తున్నదెవరు? అని న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్‌తోకూడిన ధర్మాసనం ప్రశ్నించింది.‘ఇది చాలా తీవ్రమైన విషయం..మేం స్వయంగా పరిశీలిస్తాం’అని ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రజలు కనీసం న్యాయస్థానానికి వెళ్లే అవకాశం లేదని సీనియర్ న్యాయవాది హజీఫా అహ్మదీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. బాలల హక్కుల సంస్థల తరఫున సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్రంగా స్పందించారు.‘ప్రజలు న్యాయస్థానానికి వెళ్లే పరిస్థితి లేదంటే అత్యంత దారుణమే. అవసరమైతే నేనే శ్రీనగర్ వెళ్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడతా’అని సేజే ప్రకటించారు. అక్కడ పరిస్థితులపై నివేదిక అందజేయాలని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడతానన్న ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్ ఆరోపణలు అవాస్తవాలన్ని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కాశ్మీర్‌లో చిన్నారులను అక్రమంగా నిర్బంధించారంటూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
*చిత్రం... సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్