జాతీయ వార్తలు

భారత్ చేరిన ‘బుద్ధుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కొన్ని దశాబ్దాలుగా ఎందరి చేతులో మారిన 12వ శతాబ్దం నాటి బుద్ధుడి కాంస్య విగ్రహం ఎట్టకేలకు భారత్ చేరింది. 1961లో నలందలోని భారత పురావస్తు శాఖ మ్యూజియం నుంచి ఈ విగ్రహంతో పాటు 19కి పైగా పలు ఇతర విగ్రహాలు లేదా బొమ్మలు చౌర్యానికి గురయ్యాయి. 57 ఏళ్ళ తర్వాత గత ఏడాది మొదట్లో కొందరు ఔత్సాహిక కళాకారులు ఈ విగ్రహాన్ని కనిపెట్టారు. లండన్‌కు చెందిన ఓ డీలర్ దీనిని వేలం వేస్తుండగా దీనిని గుర్తించారు. ఆ సమాచారాన్ని అందుకున్న భారత రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం లండన్‌లోని మన హైకమిషనర్‌ను అప్రమత్తం చేసింది. 1961లో ఈ విగ్రహాలు చౌర్యానికి గురైనట్లుగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను ఇతర కీలక పత్రాలను ఏఎస్‌ఐ అందించింది. అంతర్జాతీయ మ్యూజియంల కౌన్సిల్ కూడా ఈ విగ్రహాన్ని పరిశీలించింది. నలందలో 1961లో చౌర్యానికి గురైన బుద్ద విగ్రహం, ఇదీ ఒక్కటేనని నిర్ధారించింది. దాంతో సదరు డీలర్ పోలీసులకు సహకరించి ఈ విగ్రహాన్ని భారత్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఈ విగ్రహం భారత్‌కు చేరుకోవడంలో కళలకు సంబంధించిన ఓ ఆన్‌లైన్ ప్రాజెక్టు కీలక పాత్ర వహించింది. దాని కృషి ఫలితంగానే ఈ విగ్రహం భారత్‌కు చేరింది.

*చిత్రం...57 ఏళ్ళ క్రితం చౌర్యానికి గురై ఎట్టకేలకు భారత్‌కు అందిన బుద్ధుడి కాంస్య విగ్రహాన్ని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్