జాతీయ వార్తలు

పాత మార్గాల్లో చొరబాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 17: భారత ప్రభుత్వం కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేసినప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్మీ సుమారు 60 మంది ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపించడానికి గతంలో ఉపయోగించిన రహస్య మార్గాలను ఉపయోగించిందని అధికారులు మంగళవారం ఇక్కడ తెలిపారు.
పాకిస్తాన్ సరిహద్దుల మీదుగా ఇటీవల ఉత్తర కాశ్మీర్, పూంచ్, జమ్ము రీజియన్‌లోని రాజౌరిలలో గల ఎత్తయిన ప్రాంతాలలోకి చొరబాట్లు పెరిగాయని నిఘా వర్గాలు అందించిన సమాచారం నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చినట్టు అధికారులు వివరించారు. అయితే, సరిహద్దుల మీదుగా ఉగ్రవాదుల చొరబాట్లపై ఆర్మీ నుంచి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనలు రాలేదు. నియంత్రణ రేఖ మీదుగా భారత్‌లోకి ఎన్ని చొరబాట్లు జరిగాయి, ఎన్ని చొరబాటు యత్నాలు విఫలమయ్యాయి అనే అంశాన్ని అంచనా వేయడానికి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆర్మీ ప్రతినిధులు కాశ్మీర్‌లోని గురెజ్, మాచిల్, గుల్మర్గా సెక్టార్లు, జమ్మూకాశ్మీర్ రీజియన్‌లోని వివిధ సంస్థలు సేకరించిన ఆధారాలను సమర్పించారని అధికారులు వివరించారు. నియంత్రణ రేఖ మీదుగా అనేక చొరబాటు యత్నాలు జరిగాయని, వాటిలో మెజారిటీ యత్నాలు విఫలమయ్యాయని జమ్మూకాశ్మీర్ డీజీపీ ఇటీవల చెప్పారు. ఈ ప్రయత్నాలలో కొంతమంది భారత్‌లోకి చొరబడి ఉండే అవకాశాలను ఆయన తోసిపుచ్చలేదు. ఈ అంశంపై ఆరా తీస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 1990 తొలి నాళ్లలో ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సెంట్రల్ కాశ్మీర్‌లోకి చొరబడేందుకు గుల్మర్గ్‌లోని ఎత్తయిన ప్రాంతాలను ఉపయోగించుకున్నారు. 2014లో ఉధంపూర్‌లో ఒక బీఎస్‌ఎఫ్ వాహనంపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించిన మిలిటెంట్ నవీద్‌ను అరెస్టు చేయగా, ఇంటరాగేషన్‌లో అతను తాను ‘ఉస్తాద్ పోస్ట్’ మీదుగా గుల్మర్గ్‌లోని ఎత్తయిన ప్రాంతానికి, అక్కడి నుంచి కాశ్మీర్ లోయలోకి చేరుకున్నానని చెప్పడంతో ఆర్మీ ఆశ్చర్యపోయింది. అయితే, ఉగ్రవాదులు ఇప్పుడు కాశ్మీర్ లోయలోకి చొరబడేందుకు అదే మార్గాన్ని ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తోందని అధికారులు తెలిపారు. వీరిలో కొందరు దక్షిణ కాశ్మీర్‌లోని బుద్గాం, పుల్వామాలకు చెందిన వివిధ ప్రాంతాలలో కనిపించారని వారు వివరించారు. కొంతమంది ఉగ్రవాదులతో కూడిన బృందం బాబా రెషి ఏరియాకు చేరుకుందని, తరువాత అక్కడి నుంచి పఖెర్‌పొర మీదుగా తీవ్ర అస్థిర పరిస్థితులు గల పుల్వామా జిల్లాకు చేరుకొని, అక్కడ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందని అధికారులు వివరించారు. మరో ఉగ్రవాదుల బృందం బుద్గాం సెంట్రల్ జిల్లాకు చేరుకుందని వారు తెలిపారు.