జాతీయ వార్తలు

పీఓకే భారత్‌లో భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్‌పై ఏదో ఒక రోజు మనకు భౌతిక ఆధిపత్యం లభిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జయశంకర్ మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్ భారత్‌లో ఒక భాగం, దానిపై మనకు భౌతికాధికారం లభించే రోజు తప్పక వస్తుందని అన్నారు. పాక్ అక్రమిత కాశ్మీర్ విషయంలో మనది మొదటి నుంచీ ఒకే వాదన.. పీఓకే భారత్‌లో ఒక భాగం.. ఇది ఎప్పటికీ మారదని ఆయన స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో దృఢమైన, పటిష్టమైన సంబంధాలు కలిగి ఉండాలన్నది మన వాంఛ.. అయితే పొరుగు దేశం నుంచి మనకు ప్రత్యేక సవాళ్లు ఎదురవుతున్నాయనేది కూడా గుర్తించాలని జయశంకర్ అన్నారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించే ఆర్టికల్ 370 వివాదం కాదు.. అసలు సమస్య పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదమని ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఏ దేశం తమ పొరుగు దేశంపైకి బహిరంగంగా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోందో చూపించండి ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ తమ విదేశాంగ దౌత్య విధానంలో భాగంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని జయశంకర్ ఆరోపించారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న కుల్‌భూషన్ జాదవ్‌ను స్వదేశానికి తీసుకురావలసిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు. కుల్‌భూషన్ జాదవ్ సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో నివసించే హిందూ, సిక్కు, క్రైస్తవ మైనారిటీల సంఖ్య గత 70 సంవత్సరాల్లో గణనీయంగా తగ్గిపోయిందని జయశంకర్ వెల్లడించారు. సింథ్ ప్రాంతంలో మైనారిటీల హక్కులను హరిస్తున్నారు, వారిపట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్తార్‌పూర్ కారిడార్ విషయంలో ఎదురైన సమస్యలను పరిష్కరించాం. ఇతర మతాల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే ముస్లిం మత నాయకుడు జాకిర్ నాయక్‌ను స్వదేశానికి తెచ్చి తీరుతామని అన్నారు. జాకిర్ నాయక్ ప్రస్తుతం మలేషియలో తలదాచుకోవటం తెలిసిందే.
*చిత్రం... విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జయశంకర్