జాతీయ వార్తలు

సర్దార్ స్పూర్తితోనే ‘370’ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెవదియా (గుజరాత్), సెప్టెంబర్ 17: సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ దూర దృష్టి, విశాల థృక్ఫథం అద్వీతయమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆయన ఇచ్చిన స్పూర్తితోనే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు వంటి కీలక నిర్ణయాన్ని తీసుకోగలిగామని అన్నారు.
దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న కాశ్మీర్ సమస్యకు 370-అధికరణ రద్దు ద్వారా పరిష్కారాన్ని అందించామని తెలిపారు. గుజరాత్ పర్యటనకు వచ్చిన మోదీ మంగళవారం నాడిక్కడ జరిగిన ఓ ర్యాలీలో ఇక్కడ మాట్లాడారు. హైదరాబాద్ విమోచన దినం కూడా సర్దార్ పటేల్ తీసుకున్న నిర్ణయం ఫలితమేనని ఆయన అన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన ఘనత పటేల్‌దేనని అన్నారు. సర్దార్ పటేల్ విగ్రహ సందర్శనకు వస్తున్న యాత్రికుల సంఖ్య రోజు రోజుకూ పెరగడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదన్నారు.
133 అడుగుల ఈ విగ్రహాన్ని ప్రతి రోజూ 8,500 మంది సందర్శిస్తున్నారని అన్నారు. గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతున్నదని మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసిన లక్షలాది మందికి నమస్కరిస్తున్నానని అన్నారు. భారీ ప్రాజెక్టుల వల్ల పర్యావరణం పరంగా కలిగే ప్రభావాన్ని ప్రస్తావించిన ఆయన ‘పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధి సాధించాలన్నది భారతీయ సంస్కృతి, మనం ప్రకృతి ప్రేమికులం, అదే మన ఆభరణం’ అని అన్నారు. వ్యవసాయ రంగంలో ప్రతి నీటి బొట్టుకూ మరో పంట అనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. డ్రిప్, మైక్రో ఇరిగేషన్ ద్వారా 2001లో గుజరాత్‌లో 14 వేల హెక్టార్లను మాత్రమే సాగులోకి తేగలిగామని, ఇప్పుడు అది 19 లక్షలకు పెరిగిందని మోదీ తెలిపారు. తన 69వ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ వచ్చిన మోదీ సర్దార్ సరోవర్ డ్యాం వద్ద నర్మదా దేవికి ప్రార్థనలు జరిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరాడియాలోని సీతాకోక చిలుకల గార్డెన్‌ను ఆయన సందర్శించారు. ముందుగా సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన ఆయన హెలికాప్టర్‌లో ఇక్కడికి వస్తున్నప్పుడు ఆయన ఆ దృశ్యాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
*చిత్రాలు..తన 69వ జన్మదినం సందర్భంగా మంగళవారం కవాడియా జిల్లాలోని సీతాకోక చిలుకల ఉద్యానవనాన్ని, కాక్టస్ గార్డెన్‌నూ సందర్శించిన ప్రధాని మోదీ