జాతీయ వార్తలు

మాయావతికి ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్/ లక్నో, సెప్టెంబర్ 17: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రాజస్థాన్‌లోని ఆ పార్టీకి చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన మాయావతి ఈ చర్యను విశ్వాస ఘాతుకమయినదిగా అభివర్ణించారు. రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 200 స్థానాలు గల రాజస్థాన్ అసెంబ్లీలో అధికార పార్టీ బలం 106కు పెరిగింది. అయితే, ఇప్పుడు అసెంబ్లీలో మొత్తం 198 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తన పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై మాయావతి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అవిశ్వసనీయమయిన, నమ్మకద్రోహ పార్టీ అని నిరూపించుకుందని ఆమె ధ్వజమెత్తారు. బీఎస్‌పీ ఎమ్మెల్యేలు రాజేంద్ర సింగ్ గుఢా, జోగేంద్ర సింగ్ ఆవానా, వాజిబ్ అలీ, లఖన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్‌చంద్ సోమవారం రాత్రి అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని కలిసి, తాము కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపే ఒక లేఖను ఆయనకు అందజేశారు.
బీఎస్‌పీకి చెందిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు గెహ్లాట్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చారు. వారు ముఖ్యమంత్రితో స్థిరంగా సంబంధాలు నెరపుతూ వచ్చారు. ‘రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి మేమంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. మేము తొలుత ముఖ్యమంత్రిని కలిశాం. తరువాత మా నిర్ణయాన్ని తెలియజేస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు ఒక లేఖ ఇచ్చాం’ అని ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒకరయిన జోగీందర్ సింగ్ ఆవానా మంగళవారం జైపూర్‌లో విలేఖరులకు తెలిపారు.
విశ్వాసఘాతుకమే : మాయావతి
రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఎస్‌పీ ఎమ్మెల్యేలను తనలో చేర్చుకోవడం ద్వారా మరోసారి విశ్వాసఘాతుక పార్టీగా నిరూపించుకుందని మాయావతి మంగళవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తన క్రూరమయిన ప్రత్యర్థులు, సంస్థలకు వ్యితిరేకంగా పోరాడటానికి బదులు తనకు సహకరించిన, మద్దతిచ్చిన పార్టీలకు హాని తలపెట్టడానికే పని చేస్తోందని మాయావతి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అంబేద్కర్‌ను, ఆయన మానవతావాద సిద్ధాంతాన్ని వ్యతిరేకించిందని, అందుకే అంబేద్కర్ దేశ తొలి న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని మాయావతి మరో ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

*చిత్రం...బీఎస్‌పీ అధినేత్రి మాయావతి