జాతీయ వార్తలు

బకాయిలు, బ్యాంకుల విలీనంపై చర్చిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా, సెప్టెంబర్ 17: తమ రాష్ట్రానికి విడుదల చేయాల్సి ఉన్న నిధుల బకాయిలు, బ్యాంకుల విలీనం, ఏయిర్ ఇండియా, బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం కానున్నారు. వైరి పక్షాలైన ఇరువురు నేతల భేటీ కీలకం కాబోతుందన్న ప్రచారం జరుగుతున్నది. పైగా తాజా లోక్‌సభ ఎన్నికల తర్వాత మంచి సంబంధాలు లేని సమయంలో మమత ప్రధాని మోదీతో సమావేశం కాబోండడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రధాని మోదీని కలిసేందుకు మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరడానికి ముందు ముఖ్యమంత్రి మమత విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో కొంత సేపు ముచ్చటించారు. హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏమీ లేదని, ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగానే కలవనున్నానని, పైగా అధికారిక పర్యటని అని, రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించేందుకేనని ఆమె విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. బ్యాంకుల విలీనాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు ఆమె తెలిపారు. తాను దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళడం అనేది చాలా అరుదు అని చెప్పారు. ఎందుకంటే తనకు రాష్ట్రంలోనే ఎన్నో బాధ్యతలు ఉన్నాయన్నారు. ఈ దఫా కొన్ని ముఖ్యమైన పనులపై చర్చించేందుకు వెళుతున్నానని ఆమె చెప్పారు. ఇది పూర్తిగా అధికార పర్యటన అని ఆమె అన్నారు. దేశ రాజధానిలోనే రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధాని, కేంద్ర మంత్రులు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళక తప్పదన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె తెలిపారు.