జాతీయ వార్తలు

తెగిన రైల్వే ట్రాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, సెప్టెంబర్ 17: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎగువన నల్లమల అటవీప్రాంతంలో సోమవారం అర్థరాత్రి నుంచి భారీవర్షాలు కురిశాయి. దీనితో కొన్నిప్రాంతాలు జలమయమయ్యాయి. చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్‌పై నీరు ప్రవహించడంతో రైల్వేట్రాక్ పూర్తిగా దెబ్బతింది. రైలుట్రాక్‌పై ఉన్న కంకర, మట్టి కొట్టుకుపోవడంతో ట్రాక్ భారీఎత్తున కోతకు గురైంది. దీనితో మంగళవారం ఉదయం నుంచి గుంటూరు - గుంతకల్లు మార్గంలో చలమ వద్ద ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు. గుంటూరు - డోన్ ప్యాసింజర్ రైళ్ళను నిలిపివేశారు. నాలుగు గూడ్స్ బండ్లను నంద్యాలలో ఆపివేయగా నల్లమల రైల్వేస్టేషన్ అయిన దిగువమెట్టలో గుంటూరు - కాచిగూడ రైలు, ఐదు గూడ్స్ బండ్లను నిలిపివేయగా మరికొన్ని రైళ్ళను దారిమళ్ళించారు. కాచిగూడ - గుంటూరు ప్యాసింజర్ రైలును దిగువమెట్ట నుంచి గుంటూరుకు పంపారు. రైల్వే అధికారులు రైల్వేట్రాక్‌ను పరిశీలిస్తున్నారు.

*చిత్రం...నల్లమలలోని చలమ రైల్వేస్టేషన్ సమీపంలో భారీ వర్షాలకు కోతకు గురైన రైల్వేట్రాక్